విజయ్ ప్రమాణ స్వీకారానికి కుటుంబం దూరం.. నెట్టింట జోరుగా చర్చ..
ABN , Publish Date - May 10 , 2026 | 06:22 PM
తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకార వేడుకలో ఆయన కుటుంబ సభ్యులు కనిపించకపోవడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. విజయ్ భార్య సంగీత, పిల్లలు హాజరుకాకపోవడంపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రమాణ స్వీకార వేడుకలో ఆయన కుటుంబ సభ్యులు కనిపించకపోవడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. విజయ్ భార్య సంగీత, పిల్లలు హాజరుకాకపోవడంపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విజయ్ తల్లిదండ్రులు, రాజకీయ, సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు (Vijay Trisha rumours).
ప్రముఖ నటి త్రిష కూడా ఈ కార్యక్రమానికి హాజరై సందడి చేశారు (Vijay wife absent). అయితే విజయ్ పిల్లలు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. విజయ్, ఆయన భార్య సంగీత విడాకుల కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది. పిల్లలు కూడా తల్లితోనే ఉంటున్నారు. 27 ఏళ్ల వైవాహిక బంధం తర్వాత సంగీత గత ఫిబ్రవరిలో చెంగల్పట్టి కుటుంబ సంక్షేమ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. భర్త వివాహేతర సంబంధం, మానసిక క్షోభను ఆమె విడాకులకు కారణాలుగా పేర్కొన్నారు. తదుపరి విచారణ జూన్ 15న జరగనుంది.
ఇవి కూడా చదవండి..
మీ బిడ్డను ముద్దాడే ముందు వారి గురించి ఆలోచించండి.. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీకి ఇరాన్ ఎంబసీ చురక..
విజయ్ ప్రమాణ స్వీకారం.. వందేమాతర గేయం ఆరు చరణాలు ఆలపించి..