తమిళనాడులో నేనే పవర్ సెంటర్: ముఖ్యమంత్రి విజయ్
ABN , Publish Date - May 10 , 2026 | 04:12 PM
దాదాపు ఆరు రోజుల ఉత్కంఠ అనంతరం తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. తమిళనాడులో ఒకే ఒక పవర్ సెంటర్ ఉందని అన్నారు.
దాదాపు ఆరు రోజుల ఉత్కంఠ అనంతరం తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. తమిళనాడులో ఒకే ఒక పవర్ సెంటర్ ఉందని, అది తానేనని విజయ్ స్పష్టం చేశారు. మిత్రపక్షాల ఒత్తిడికి తలొగ్గకుండా పని చేస్తానని స్పష్టం చేశారు (Vijay oath speech).
చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన వేడుకలో విజయ్‌తో పాటు టీవీకేకు చెందిన తొమ్మిది మంది మంత్రులు కూడా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహా పలువురు జాతీయ, రాష్ట్ర నాయకులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం విజయ్ ప్రసంగిస్తూ.. 'నేను తప్ప మరో అధికార కేంద్రం ఉండదు. నేనే ఏకైక అధికార కేంద్రంగా ఉంటాను' అని పేర్కొన్నారు. తన నిర్ణయాలపై ఏ మిత్రపక్షం నియంత్రణా ఉండదని, టీవీకే నేతృత్వంలోని ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిడీ ఉండదని ఆయన స్పష్టం చేశారు (Only one power centre).
'నేను తప్పు చేయను. నాతో పాటు ఉన్నవారిని కూడా తప్పు చేయనివ్వను (Vijay Tamil Nadu CM). ఎవరికైనా తప్పుడు ఆలోచనలు ఉంటే, వాటిని వెంటనే తొలగించండి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మద్దతు ఇచ్చిన పార్టీలకు ధన్యవాదాలు. నేను రాజ కుటుంబంలో పుట్టలేదు. పేదరికం, ఆకలి అంటే ఏమిటో నాకు తెలుసు. నేను మీలో ఒకడిని. నేను దేవదూతను కాదు.. సాధారణ మనిషిని' అని విజయ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
మీ బిడ్డను ముద్దాడే ముందు వారి గురించి ఆలోచించండి.. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీకి ఇరాన్ ఎంబసీ చురక..
విజయ్ ప్రమాణ స్వీకారం.. వందేమాతర గేయం ఆరు చరణాలు ఆలపించి..