Share News

హంగేరి ప్రధాని ప్రమాణ స్వీకారం.. వేదికపై మంత్రి సూపర్ డ్యాన్స్..

ABN , Publish Date - May 10 , 2026 | 03:38 PM

హంగేరీ కొత్త ప్రధానిగా పీటర్ మాగ్యార్ ప్రమాణ స్వీకారం చేసిన వేడుకలో ఓ మంత్రి చేసిన డాన్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.

హంగేరి ప్రధాని ప్రమాణ స్వీకారం.. వేదికపై మంత్రి సూపర్ డ్యాన్స్..
Zsolt Hegedus viral video

హంగేరీ కొత్త ప్రధానిగా పీటర్ మాగ్యార్ ప్రమాణ స్వీకారం చేసిన వేడుకలో ఓ మంత్రి చేసిన డాన్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. బుడాపెస్ట్‌లోని హంగేరీ పార్లమెంట్ భవనం వెలుపల జరిగిన ఈ వేడుకలో రాజకీయ నేత జోల్ట్ హెగడస్ అద్భుతంగా డ్యాన్స్ చేశారు (Peter Magyar inauguration).


45 ఏళ్ల మాగ్యార్ శనివారం నాడు హంగేరీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 16 ఏళ్ల విక్టర్ ఓర్బన్ పాలనకు ముగింపు పలికారు. ఏప్రిల్ 12న జరిగిన పార్లమెంటరీ ఎన్నికలలో మాగ్యార్‌కు చెందిన టిస్జా పార్టీ 199 స్థానాలకు గాను 141 స్థానాలను కైవసం చేసుకుని భారీ విజయాన్ని సాధించింది. శనివారం కొత్త ప్రధానిగా మాగ్యార్ ప్రమాణ స్వీకారం చేశారు. మాగ్యార్ ప్రసంగం అనంతరం మంత్రి జోల్ట్ ఉత్సాహభరితంగా డ్యాన్స్ చేశారు (Zsolt Hegedus viral video).


మాగ్యార్ కొత్త ప్రభుత్వంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖకు జోల్ట్ హెగ‌డస్ నాయకత్వం వహించనున్నట్టు సమాచారం (Hungarian politician dance). డాన్యూబ్ నది ఒడ్డున గుమిగూడిన పదివేల మంది మద్దతుదారుల ముందు హెగెడస్ తనదైన శైలిలో నృత్యం చేస్తూ కనిపించారు. వేడుకల్లో పాలుపంచుకున్న ఇతర చట్టసభ సభ్యులతో పాటు మాగ్యార్ కూడా చప్పట్లు కొట్టి అభినందించారు. ఇంతకు ముందు కూడా పలు సందర్భాలలో కూడా హెగడస్ తన నాట్యంతో అందర్నీ ఆకట్టుకున్నారు.


ఇవి కూడా చదవండి..

మీ బిడ్డను ముద్దాడే ముందు వారి గురించి ఆలోచించండి.. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీకి ఇరాన్ ఎంబసీ చురక..


విజయ్ ప్రమాణ స్వీకారం.. వందేమాతర గేయం ఆరు చరణాలు ఆలపించి..

Updated Date - May 10 , 2026 | 03:55 PM