Share News

తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్..

ABN , Publish Date - May 10 , 2026 | 12:29 PM

తమిళనాడు ముఖ్యమంత్రిగా తమిళగ వెట్రి కళగం చీఫ్ జోసెఫ్ విజయ్ బాధ్యతలు స్వీకరించారు. ప్రమాణ స్వీకారం అనంతరం విజయ్ నేరుగా సచివాలయానికి వెళ్లి సీఎంగా బాధ్యతలు చేపట్టారు.

తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్..
Vijay Takes Charge as CM

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా తమిళగ వెట్రి కళగం(టీవీకే) చీఫ్ జోసెఫ్ విజయ్ బాధ్యతలు స్వీకరించారు. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం విజయ్ నేరుగా సచివాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి ఛాంబర్‌లోకి విజయ్‌ను తీసుకెళ్లారు. సీఎం సీటులో కూర్చోవాల్సిందిగా అధికారులు కోరారు.


ఈ మేరకు ముఖ్యమంత్రి కుర్చీ వద్దకు వెళ్లిన విజయ్ అందరికీ నమస్కరించారు. అనంతరం చిరునవ్వుతో ముఖ్యమంత్రి సీటులో కూర్చొని బాధ్యతలు స్వీకరించారు. కాగా, చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈ రోజు తమిళనాడు సీఎంగా విజయ్‌ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యంగా సినీ నటి త్రిష సందడి చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం.. అంబరాన్ని అంటిన సంబరాలు..

సీఎంగా విజయ్ తొలి మూడు సంతకాలు ఇవే..

Updated Date - May 10 , 2026 | 12:47 PM