Share News

సీఎంగా విజయ్ తొలి మూడు సంతకాలు ఇవే..

ABN , Publish Date - May 10 , 2026 | 11:08 AM

తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సీఎంగా విజయ్ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అతి ముఖ్యమైన మూడు కీలక కార్యక్రమాలపై సంతకాలు చేశారు.

సీఎంగా విజయ్ తొలి మూడు సంతకాలు ఇవే..
Vijay Viral Video

చెన్నై: తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సీఎంగా సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అతి ముఖ్యమైన మూడు కీలక కార్యక్రమాలపై సంతకాలు చేశారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌పై తొలి సంతకం చేశారు విజయ్. మహిళా భద్రతపై రెండో సంతకం చేశారు. దీని ద్వారా మహిళల భద్రత కోసం షీటీమ్స్ తరహాలో ప్రత్యేక నిఘా విభాగం ఏర్పాటు చేయనున్నారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ఈగల్ తరహా వ్యవస్థపై విజయ్ మూడో సంతకం చేశారు.


విజయ్ వీడియో వైరల్..

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం, పథకాలపై సంతకాల అనంతరం విజయ్ తన ఫోన్‌లో ఓ వీడియో చిత్రీకరించారు. లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, టీవీకే నాయకులు, మద్దతుదారులను స్వయంగా వీడియో తీశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన అభిమానులు, పార్టీ శ్రేణులనూ తన సెల్ ఫోన్‌లో బంధించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్‌గా మారింది.


ఈ వార్తలు కూడా చదవండి

తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం..

సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారం.. మంత్రులు వీరే..

Updated Date - May 10 , 2026 | 11:44 AM