తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం..
ABN , Publish Date - May 10 , 2026 | 10:19 AM
తమిళనాడు ముఖ్యమంత్రిగా తమిళగ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. విజయ్‌తో సీఎంగా గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియం వేదికగా ఈ కార్యక్రమం జరిగింది.
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా తమిళగ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. విజయ్‌తో సీఎంగా గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. దీంతో విజయ్ సీఎం అవుతారా, లేదా? అనే ఉత్కంఠకు తెరపడినట్లు అయ్యింది. విజయ్‌తోపాటు 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
మంత్రులుగా ఎన్.ఆనంద్, ఆదావ్ అర్జున, అరుణ్ రాజ్, సెంగొట్టయన్, బి.వెంకటరమణన్, నిర్మల్ కుమార్, రాజమోహన, డా. టీకే ప్రభు, ఎస్.కీర్తన ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో తమిళనాట 70 ఏళ్ల తర్వాత కొలువుదీరిన డీఎంకే, అన్నాడీఎంకేయేతర ప్రభుత్వంగా టీవీకే నిలిచింది. ఈ కార్యక్రమానికి టీవీకే, విజయ్ అభిమానులు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, నటి త్రిష సహా పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు హాజరయ్యారు. మరోవైపు ఈనెల 13వ తేదీ లోగా అసెంబ్లీ సాక్షిగా విజయ్ బల నిరూపణ చేసుకోవాల్సి ఉంది. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకే, ఐయూఎంఎల్ సహకారంతో విజయ్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. తమ అభిమాన నటుడు సీఎం కావడంతో విజయ్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
తమిళనాడు ఎన్నికల్లో మెుత్తం 234 స్థానాలకు గానూ విజయ్ టీవీకే పార్టీ 108 గెలుచుకుంది. రెండు స్థానాల్లో విజయ్ పోటీ చేయడంతో 107 సీట్లు గెలుచుకున్నట్లు అయ్యింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 118 సీట్లు అవసరం. తగినన్ని సీట్లు లేకపోవడంతో పలుమార్లు గవర్నర్‌ను కలిసినా ఫలితం లేకుండా పోయింది. చివరికి కాంగ్రెస్-5 సీట్లు, సీపీఐ-2, సీపీఎం-2, వీసీకే-2, ఐయూఎంఎల్-2 సీట్ల మద్దతుతో విజయ్ నేడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి ఉగ్రదాడి ముప్పు.. అప్రమత్తమైన పోలీసులు..
స్టాలిన్ చొరవతోనే విజయ్‌కు దక్కిన మద్దతు: డీఎంకే ప్రతినిధి