Share News

స్టాలిన్‌ చొరవతోనే విజయ్‌కు దక్కిన మద్దతు: డీఎంకే ప్రతినిధి

ABN , Publish Date - May 10 , 2026 | 08:30 AM

డీఎంకే అధినేత స్టాలిన్ చొరవతోనే విజయ్‌కు ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మద్దతు దక్కిందని పార్టీ ప్రతినిధి ఒకరు మీడియాతో అన్నారు.

స్టాలిన్‌ చొరవతోనే విజయ్‌కు దక్కిన మద్దతు: డీఎంకే ప్రతినిధి
Vijay, Stalin

ఇంటర్నెట్ డెస్క్: తమిళనాట పలు పార్టీలు టీవీకే అధినేత విజయ్‌కు మద్దతు ప్రకటించడంతో ప్రభుత్వ ఏర్పాటుకు అడ్డంకులన్నీ తొలగిపోయాయి. అయితే, ఇదంతా డీఎంకే అధినేత స్టాలిన్ చొరవతోనే సాధ్యమైందని పార్టీ ప్రతినిధి ఎ.శరవణన్ అన్నారు. టీవీకేకు మద్దతు తెలపాలని స్టాలిన్ తమ మిత్రపక్షాలను కోరినట్టు తెలిపారు. ‘తమిళనాడు నూతన సీఎం విజయ్‌కు శుభాకాంక్షలు. డీఎంకే మిత్రపక్షాల సహకారంతోనే ఆయన సీఎం అవుతున్నారు. రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం రావాలని మా నేత స్టాలిన్ కోరుకోవట్లేదు. అందుకే టీవీకేతో చేతులు కలపాలని మా మిత్రపక్షాలను ఆయన అభ్యర్థించారు’ అని శరవణన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్‌పై కూడా మండిపడ్డారు. డీఎంకే పార్టీ కార్యకర్తల శ్రమ వల్లే కాంగ్రెస్‌కు ఐదు అసెంబ్లీ స్థానాలు దక్కాయని గుర్తు చేశారు.


టీవీకే సారథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుపై మూడు రోజులుగా నెలకొన్న సందిగ్ధతకు శనివారం ఫుల్ స్టాప్ పడిన విషయం తెలిసింది. టీవీకేకు మద్దతు ఇస్తున్నట్టు వీసీకే పార్టీ కూడా ప్రకటించడంతో ఉత్కంఠకు తెరపడింది. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు మేజిక్ ఫిగర్ 118 ఎమ్మెల్యేలు కాగా టీవీకే పార్టీ 107 సీట్లతో అధికారానికి కొద్ది దూరంలో నిలిచిపోయింది. ఈ క్రమంలో తొలుత కాంగ్రెస్‌ (ఐదుగురు ఎమ్మెల్యేలు) మద్దతు తెలిపింది. ఆ తరువాత సీపీఐ (ఇద్దరు ఎమ్మెల్యేలు), సీపీఎం (ఇద్దరు ఎమ్మెల్యేలు) విజయ్‌కు మద్దతిచ్చేందుకు ముందుకు వచ్చాయి. దీంతో, విజయ్ సంఖ్యాబలం 116కు చేరింది. దాదాపు మూడు రోజుల సస్పెన్స్ తరువాత నిన్న వీసీకే (ఇద్దరు ఎమ్మెల్యేలు), ఐయూఎంఎల్‌ (ఇద్దరు ఎమ్మెల్యేలు) కూడా మద్దతు ప్రకటించడంతో విజయ్ సంఖ్యాబలం మ్యాజిక్ మార్కును దాటి 120కు చేరింది.


ఈ వార్తలనూ చదవండి:

ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి ఉగ్రదాడి ముప్పు.. అప్రమత్తమైన పోలీసులు..

స్థిరమైన పాలన అందించండి

Updated Date - May 10 , 2026 | 08:42 AM