సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం.. అంబరాన్ని అంటిన సంబరాలు..
ABN , Publish Date - May 10 , 2026 | 11:58 AM
తమిళనాడు ముఖ్యమంత్రిగా తమిళగ వెట్రి కళగం అధినేత ప్రమాణ స్వీకారం చేయడంతో సంబరాలు అంబరాన్ని అంటాయి. రాష్ట్రవ్యాప్తంగా టీవీకే పార్టీ శ్రేణులు, విజయ్ అభిమానులు టపాసులు కాలుస్తూ, స్వీట్లు తినిపించుకుంటూ వేడుక చేసుకుంటున్నారు.
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా తమిళగ వెట్రి కళగం అధినేత ప్రమాణ స్వీకారం చేయడంతో సంబరాలు అంబరాన్ని అంటాయి. రాష్ట్రవ్యాప్తంగా టీవీకే పార్టీ శ్రేణులు, విజయ్ అభిమానులు టపాసులు కాలుస్తూ, స్వీట్లు తినిపించుకుంటూ వేడుక చేసుకుంటున్నారు. చెన్నై, మదురై, తిరుచిరాపల్లి, తూత్తుకుడి సహా పలు ప్రాంతాల్లో నాయకులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అందరూ కలిసి రోడ్లపైకి వచ్చి వేడుక చేసుకుంటున్నారు.
వీధులన్నీ తిరుగుతూ ప్రజలకు స్వీట్లు పంపిణీ చేస్తున్నారు. 70 ఏళ్ల తర్వాత డీఎంకే, అన్నాడీఎంకేయేతర పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, నేడు విజయ్‌తోపాటు 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం వేదికగా ఈ కార్యక్రమం జరిగింది.
ఈ వార్తలు కూడా చదవండి
తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం..
సీఎంగా విజయ్ తొలి మూడు సంతకాలు ఇవే..