తమిళనాడు సీఎం విజయ్‌కు పీఎం మోదీ, డిప్యూటీ సీఎం పవన్ అభినందనలు
ABN , Publish Date - May 10 , 2026 | 12:12 PM
తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. భారత ప్రధాని మోదీ సహా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆయనకు అభినందనలు తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన జోసెఫ్ విజయ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ప్రజా జీవితాలను అభివృద్ధి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎక్స్ మీడియా వేదికగా ఆయన హామీ ఇచ్చారు.
'తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తిరు సి.జోసెఫ్ విజయ్‌కు అభినందనలు. ఆయన పదవీకాలం అద్భుతంగా సాగాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నా. ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వంతో కలిసి పనిచేయడం కొనసాగిస్తుంది' అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా సీఎం విజయ్‌కు ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. 'తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన టీవీకే విజయ్‌కు, మంత్రులందరికీ శుభాకాంక్షలు. ఈ నూతన ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చి, పారదర్శకమైన, ప్రగతిశీలమైన పాలనను అందించి, రాష్ట్రాన్ని మరింత ప్రగతి వైపునకు నడిపిస్తుందని ఆకాంక్షిస్తున్నాను' అని పవన్ తెలిపారు.
ఇవీ చదవండి:
ఇది మీ ప్రభుత్వం.. డ్రగ్స్‌పై ఈ రోజు నుంచే పోరాటం: సీఎం విజయ్
సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం.. అంబరాన్ని అంటిన సంబరాలు..