మీ బిడ్డను ముద్దాడే ముందు వారి గురించి ఆలోచించండి.. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీకి ఇరాన్ ఎంబసీ చురక..
ABN , Publish Date - May 10 , 2026 | 02:43 PM
వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఇటీవల ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఆ చిన్నారికి వివియానా అని నామకరణం చేశారు. ఆ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. చిన్నారిని ఎత్తుకున్న ఫోటోను పోస్ట్ చేశారు.
వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఇటీవల ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఆ చిన్నారికి వివియానా అని నామకరణం చేశారు. ఆ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. చిన్నారిని ఎత్తుకున్న ఫోటోను పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌పై ఆర్మేనియాలోని ఇరాన్ ఎంబసీ స్పందించింది. లీవిట్‌కు శుభాకాంక్షలు తెలియజేసింది. అలాగే ఫిబ్రవరి 28న ఇరాన్‌లోని మినాబ్‌లో జరిగిన ఓ దారుణ ఉదంతాన్ని గుర్తు చేసింది (Karoline Leavitt daughter).
ఫిబ్రవరి 28న ఇరాన్‌లోని మినాబ్‌లో ఓ పాఠశాలపై అమెరికా చేసిన దాడిలో 160 మందికి పైగా విద్యార్థులు చనిపోయారు. ఆ విషాదాన్ని గుర్తు చేస్తూ కరోలిన్ లీవిట్ పోస్ట్‌పై ఇరాన్ ఎంబసీ స్పందించింది. 'పిల్లలు అమాయకులు. వారికి ప్రేమించడం తప్ప మరొకటి తెలియదు. మినాబ్‌లోని మీ బాస్ హత్య చేసిన పిల్లలు కూడా.. మీలాంటి తల్లులు నవ మాసాలు మోసి కన్న వారే. మీ బిడ్డను ముద్దు పెట్టుకునే ముందు ఆ తల్లుల గురించి కూడా ఒకసారి ఆలోచించండి' అని ఇరాన్ ఎంబసీ పేర్కొంది (Minab school attack).
అమెరికా ప్రయోగించిన తోమహాక్ క్షిపణి మినాబ్‌లోని ఓ పాఠశాలను తాకింది (Iran US tensions). ఆ దాడిలో 160 మందికి పైగా విద్యార్థులు, 14 మంది ఉపాధ్యాయులు మరణించారు. సామూహిక సమాధులు తవ్వి వారందరినీ ఒకే చోట పూడ్చి పెట్టిన ఫొటోలను ఇరాన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే అమెరికా ఎప్పుడూ పౌరులను లక్ష్యంగా చేసుకోదని అప్పట్లో కరోలిన్ లీవిట్ వ్యాఖ్యానించారు.
ఈ వార్తలనూ చదవండి:
యూఎస్‌లో ఒక్కసారిగా పేలిన బోటు.. ఎగిరిపడిన ప్రయాణికులు..
అమెరికాలో విషాదం.. రన్‌వేపై పాదాచారిని ఢీకొట్టిన విమానం