ఒక్కసారిగా పేలిన బోటు.. ఎగిరిపడిన ప్రయాణికులు..
ABN , Publish Date - May 10 , 2026 | 08:43 AM
అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో బోటు అనుమానాస్పద పేలుడు ఘటన కలకలం రేపింది. మియామి నగరంలోని ప్రసిద్ధ హాలోవర్ సాండ్‌బార్ సమీపం బిస్కేన్ బే ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఫ్లోరిడా: అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో బోటు అనుమానాస్పద పేలుడు ఘటన కలకలం రేపింది. మియామి నగరంలోని ప్రసిద్ధ హాలోవర్ సాండ్‌బార్ సమీపం బిస్కేన్ బే ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సుమారు 14 మంది పర్యాటకులు బోటులో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 11 మంది గాయపడ్డారు. బాధితుల్లో కొంతమందికి తీవ్రగాయాలైనట్లు స్థానిక అధికారులు తెలిపారు. బోటులో గ్యాస్ లీకేజీ కారణంగానే పేలుడు జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
హాలోవర్ సాండ్‌బార్ ప్రాంతం పర్యాటకులతో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ముఖ్యంగా వారాంతాల్లో ఇక్కడికి సందర్శకులు భారీ వస్తుంటారు. అయితే, శనివారం నాడు పర్యాటకులతో వెళ్తున్న ఓ చార్టర్ బోటులో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి బోటు నుంచి ప్రయాణికులు ఎగిరి నీటిలో పడ్డారు. ఒక్కసారిగా భారీ పేలుడు జరగడంతో చుట్టుపక్కల ఉన్న పర్యాటకులంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న మియామి డేడ్ ఫైర్ రెస్క్యూ బృందాలు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నాయి.
ఈ ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించాయి. అనంతరం 11 మంది బాధితులను సమీప ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనపై ఫ్లోరిడా ఫిష్ అండ్ వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్ కమిషన్ అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. పేలుడుకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. బోటులో గ్యాస్ లీకేజీ కారణంగానే పేలుడు జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
హోర్ముజ్‌లో కలకలం! నావలో మంటలు.. భారతీయుడి మృతి
అమెరికాలో విషాదం.. రన్‌వేపై పాదాచారిని ఢీకొట్టిన విమానం