Share News

కుర్దిస్థాన్ అధ్యక్షుడి నివాసంపై దాడి.. అమెరికా, ఐఆర్‌జీసీ పరస్పర విమర్శలు..

ABN , Publish Date - Mar 29 , 2026 | 10:44 AM

పశ్చిమాసియాలోని ఉద్రిక్తతలు క్రమంగా ఇతర దేశాలకు కూడా విస్తరిస్తున్నాయి. తాజాగా ఇరాక్‌లోని కుర్దిస్థాన్ ప్రాంతీయ అధ్యక్షుడు నెచిర్వాన్ బార్జానీ నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడిలో ఆయనకు ఎటువంటి గాయాలూ కాలేదని సమాచారం.

కుర్దిస్థాన్ అధ్యక్షుడి నివాసంపై దాడి.. అమెరికా, ఐఆర్‌జీసీ పరస్పర విమర్శలు..
Kurdish president residence attack

పశ్చిమాసియాలోని ఉద్రిక్తతలు క్రమంగా ఇతర దేశాలకు కూడా విస్తరిస్తున్నాయి. తాజాగా ఇరాక్‌లోని కుర్దిస్థాన్ ప్రాంతీయ అధ్యక్షుడు నెచిర్వాన్ బార్జానీ నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడిలో ఆయనకు ఎటువంటి గాయాలూ కాలేదని సమాచారం. ఈ దాడిని కుర్దిస్థాన్ ప్రాంతీయ ప్రధానమంత్రి మస్రూర్ బర్జానీ ఖండించారు. ఇది ఒక పిరికపంద చర్య అని విమర్శించారు. బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు (Kurdish president residence attack).


తమ పౌరుల భద్రత, ప్రయోజనాలను కాపాడుకునేందుకు కుర్దిస్థాన్ ప్రాంతానికి అంతర్జాతీయ సమాజం మద్దతు ఇవ్వాలని మస్రూర్ బర్జానీ కోరారు. ఇలాంటి దాడులపై ప్రతిస్పందించే హక్కు తమకు ఉందని, తమ ప్రాంతాన్ని రక్షించుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని అన్నారు. కాగా, ఈ దాడికి మీరంటే మీరే కారణమని అమెరికా, ఇరాన్‌లు ఒకరిపై మరొకరు అరోపణలు చేసుకుంటున్నాయి (Drone attack Iraq).


ఇరాన్‌కు మద్దతుగా ఉండే మిలీషియాలు ఈ దాడికి పాల్పడ్డారని అమెరికా ఆరోపించింది (Iraq Kurdistan news). కాగా, అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఈ హత్యాయత్నం చేశాయని ఇరాన్ పేర్కొంది. కుర్దిస్థాన్ అధ్యక్షుడిని లక్ష్యంగా చేసుకుని దాడి చేయడాన్ని ఐఆర్‌జీసీ తీవ్రంగా ఖండించింది. ఇది ఉగ్రవాద చర్య అని ఐఆర్‌జీసీ పేర్కొంది. ప్రాంతీయ భాగస్వాములను రక్షించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చింది.


ఇవి కూడా చదవండి..

స్థిరంగా వెండి, బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..


అమెరికా అధ్యక్షుడికి వ్యతిరేకంగా నో కింగ్స్ నిరసన..

Updated Date - Mar 29 , 2026 | 10:44 AM