Share News

మంత్రి పొంగులేటిని తొలగించాల్సిందే: కేటీఆర్

ABN , Publish Date - Mar 29 , 2026 | 10:27 AM

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కుటుంబ స్కామ్ బయటపడడంతో ప్రభుత్వం బిత్తరపోయిందని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. అక్రమం జరగడం వాస్తవమేనని ముఖ్యమంత్రి ఒప్పుకున్నారని, అయినా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం లేదని అన్నారు.

మంత్రి పొంగులేటిని తొలగించాల్సిందే: కేటీఆర్
KTR

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కుటుంబ స్కామ్ బయటపడడంతో ప్రభుత్వం బిత్తరపోయిందని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. అక్రమం జరగడం వాస్తవమేనని ముఖ్యమంత్రి ఒప్పుకున్నారని, అయినా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. ఆ అవినీతిలో తనకు కూడా వాటా ఉన్నందునే ముఖ్యమంత్రి చర్య తీసుకోవడం లేదా అని ప్రశ్నించారు (Ponguleti controversy).


రాఘవ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీకి 2020 నుంచి 2022 వరకు పొంగులేటి చైర్మన్‌గా ఉన్నారని, సీఎం మాత్రం ఆ కంపెనీ పొంగులేటి దూరపు బంధువులదని చెబుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. సీఎం రెండున్నర ఏళ్లుగా ప్రజలకు పనికివచ్చే ఒక పని కూడా చేయలేదని, అవినీతికి పాల్పడిన మంత్రిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, మంత్రి కుటుంబాన్ని ఎందుకు కాపాడుతున్నారని ప్రశ్నించారు. మైనింగ్ పేరిట రాష్ట్రంలో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. కోకాపేట్‌లోని భాగ్యలక్ష్మి మైనింగ్ ముఖ్యమంత్రి బంధువులదని అన్నారు (KTR Comments).


వేల కోట్ల అవినీతి చేయకపోతే ఎందుకు సభను వాయిదా వేసుకున్నారని కేటీఆర్ ప్రశ్నించారు (Telangana politics). 280 ఎకరాలను తమ ప్రభుత్వం ఎల్ అండ్ టీ కంపెనీకి లీజుకు ఇచ్చిందని, ఆ భూమిని కూడా కొట్టేయడానికి దండుపాల్యం బ్యాచ్ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఎల్ అండ్ టీ సీఎఫ్‌ఓను జైలులో వేస్తామని బెదిరించారని అన్నారు. ఇది పెద్ద కుంభకోణమని, ప్రభుత్వం వినకపోతే గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. మంత్రి పొంగులేటిని పదవి నుంచి తొలగించాల్సిందేనని డిమాండ్ చేశారు.


ఇవి కూడా చదవండి..

స్థిరంగా వెండి, బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..


అమెరికా అధ్యక్షుడికి వ్యతిరేకంగా నో కింగ్స్ నిరసన..

Updated Date - Mar 29 , 2026 | 10:47 AM