స్థిరంగా వెండి, బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - Mar 03 , 2026 | 06:55 AM
అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారం, వెండికి డిమాండ్ కొనసాగుతోంది. ఇటీవలి కాలంలో కాస్త స్థిరంగా కొనసాగిన బంగారం, వెండి ధరలు ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఒక్కసారిగా పెరిగాయి.
అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారం, వెండికి డిమాండ్ కొనసాగుతోంది. ఇటీవలి కాలంలో కాస్త స్థిరంగా కొనసాగిన బంగారం, వెండి ధరలు ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఒక్కసారిగా పెరిగాయి. యుద్ధం కారణంగా మరింత భారీగా పెరిగే అవకాశముందని అంచనాలు వెలువడుతున్నాయి (Gold prices).
ఈ రోజు (మార్చి 3న) ఉదయం 6:30 గంటల సమయంలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,70,500 దగ్గర ఉంది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,290 దగ్గర ఉంది (live gold rates). ఇక, దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,70,650కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,56,440కి చేరుకుంది.
మరోవైపు వెండి ధర కూడా స్థిరంగా కొనసాగుతోంది. మూడు లక్షల రూపాయల మార్క్‌ను దాటేసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు పలు నగరాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)
హైదరాబాద్‌లో రూ.1,70,500, రూ.1,56,290
విజయవాడలో రూ.1,70,500, రూ.1,56,290
ఢిల్లీలో రూ.1,70,650, రూ.1,56,440
ముంబైలో రూ.1,70,500, రూ.1,56,290
వడోదరలో రూ.1,70,550, రూ.1,56,340
కోల్‌కతాలో రూ.1,70,500, రూ.1,56,290
చెన్నైలో రూ.1,70,830, రూ.1,56,590
బెంగళూరులో రూ.1,70,500, రూ.1,56,290
కేరళలో రూ.1,70,500, రూ.1,56,290
పుణెలో రూ.1,70,500, రూ.1,56,290
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)
హైదరాబాద్‌లో రూ.3,14,900
విజయవాడలో రూ.3,14,900
ఢిల్లీలో రూ.3,15,100
చెన్నైలో రూ.3,14,900
కోల్‌కతాలో రూ.3,15,100
కేరళలో రూ.3,14,900
ముంబైలో రూ.3,15,100
బెంగళూరులో రూ.3,15,100
వడోదరలో రూ.3,15,100
అహ్మదాబాద్‌లో రూ.3,15,100
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
ఇవి కూడా చదవండి
ఇరాన్ తన వ్యూహాన్ని మార్చిందా?
ఇరాన్‌పై దాడులు! అమెరికన్ల అభిప్రాయం ఏంటంటే..