ఇరాన్‌పై దాడులు! అమెరికన్ల అభిప్రాయం ఏంటంటే..
ABN , Publish Date - Mar 02 , 2026 | 03:41 PM
ఇరాన్‌పై సైనిక చర్యను 27 శాతం మంది అమెరికన్లే సమర్థిస్తున్నట్టు తాజాగా జరిగిన ఓ సర్వేలో తేలింది. దేశ సైనికులను రిస్క్‌లోకి నెట్టడంపై అనేక మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా జరుపుతున్న దాడులు ఏ మలుపు తిరుగుతాయో అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. అమెరికన్లలో ఈ అంశంపై చర్చ పతాకస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై దాడి చేయడాన్ని 27 శాతం మంది అమెరికన్లే సమర్థిస్తున్నట్టు ఓ సర్వేలో తేలింది. శని, ఆదివారాల మధ్య నిర్వహించిన రాయిటర్స్ ఇప్సోస్ పోల్‌లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
అమెరికన్లలో భిన్నాభిప్రాయాలు
ఈ సర్వే ప్రకారం, అమెరికా సైనిక చర్యకు పూనుకోవడాన్ని 27 శాతం మంది అమెరికన్లే సమర్థించారు. 43 శాతం మంది ఈ చర్యను వ్యతిరేకించగా 29 శాతం మంది తాము ఏ నిర్ణయానికీ రాలేకపోతున్నామని చెప్పారు. అమెరికా అధికార రిపబ్లికన్ పార్టీ మద్దతుదారుల్లో 55 శాతం మంది ఇరాన్‌పై సైనిక చర్యకు మద్దతు తెలిపారు. మిగిలిన వారు తాజా పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా సైనికులు ప్రమాదంలో పడటం తమకు ఇష్టం లేదని 42 శాతం మంది రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులు పేర్కొన్నారు.
అమెరికా ప్రయోజనాల పరిరక్షణకు సైనిక శక్తిని వినియోగించడంపై ట్రంప్ అత్యుత్సాహంగా ఉన్నారని 56 మంది అమెరికన్లు ఈ సర్వేలో అభిప్రాయపడ్డారు. ఇక ట్రంప్ పనితీరుపై 39 శాతం మందే సంతృప్తితో ఉన్నట్టు కూడా ఈ సర్వేలో తేలింది. అంతకుముందు రేటింగ్స్‌తో పోలిస్తే ఈసారి ట్రంప్ విధానాలకు జనాల మద్దతు తగ్గినట్టు తేలింది.
ఇక తమ లక్ష్యాలు నెరవేరే వరకూ తమ మిషన్ కొనసాగుతుందని ట్రంప్ ఆదివారం పేర్కొన్నారు. ఈ వ్యవహారం ముగిసే సరికి మరింత మంది అమరులు కావొచ్చని వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి
ఇరాన్‌పై దాడులు.. చైనా గగనతల రక్షణ వ్యవస్థ విఫలం!
గ్రోక్ జోస్యం! చెప్పిన తేదీకే మొదలైన యుద్ధం! మస్క్ రియాక్షన్ ఇదీ