Share News

లాక్‌డౌన్ అంచున పాకిస్థాన్.. ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచిన ఇరాన్ యుద్ధం..

ABN , Publish Date - Mar 29 , 2026 | 09:31 AM

పశ్చిమాసియాలోని ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలపై తీవ్ర ఆర్థిక ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ముఖ్యంగా చమురు దిగుమతులపై ఆధారపడిన దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే తీవ్ర ద్రవ్యోల్బణంతో బాధపడుతున్న పాకిస్థాన్‌ను ఈ యుద్ధం మరింత కష్టాల్లోకి నెట్టేసింది.

లాక్‌డౌన్ అంచున పాకిస్థాన్.. ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచిన ఇరాన్ యుద్ధం..
Pakistan inflation crisis

పశ్చిమాసియాలోని ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలపై తీవ్ర ఆర్థిక ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ముఖ్యంగా చమురు దిగుమతులపై ఆధారపడిన దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే తీవ్ర ద్రవ్యోల్బణంతో బాధపడుతున్న పాకిస్థాన్‌ను ఈ యుద్ధం మరింత కష్టాల్లోకి నెట్టేసింది. పాక్‌లో ఇప్పటికే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తారస్థాయికి చేరుకున్నాయి. యుద్ధ పరిణామాల గురించి తాజాగా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు (Pakistan inflation crisis).


పెరుగుతున్న ఇంధన ధరల కారణంగా తీవ్రమవుతున్న ఆర్థిక సంక్షోభం గురించి పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాట్లాడారు. ఇంధన ధరలను నియంత్రించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. అంతర్జాతీయ ధరలు పెరుగుతున్నప్పటికీ పెట్రోల్‌పై భారీ సబ్సిడీ కొనసాగుతోందని పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆయన పలు సూచనలు చేశారు. ఇంధన సంక్షోభం నేపథ్యంలో వినియోగాన్ని తగ్గించడం, పాఠశాలలను ఆన్‌లైన్‌కు మార్చడం వంటి పొదుపు చర్యలను ప్రవేశపెట్టినట్టు తెలిపారు (Iran war impact Pakistan).


ఇంధన పొదుపు విషయంలో ప్రజలు మరింతగా సహకరించాలని షెహబాజ్ షరీఫ్ విజ్ఞప్తి చేశారు (Pakistan lockdown news). ఇక, పశ్చిమాసియాలో శాంతి కోసం పాకిస్థాన్ చేస్తున్న దౌత్యపరమైన కృషిని కూడా షరీఫ్ నొక్కి చెప్పారు. చర్చలకు మధ్యవర్తిత్వం వహించడానికి ముందుకొచ్చినట్టు తెలిపారు. కాగా, ప్రస్తుత ఇంధన సంక్షోభం నేపథ్యంలో పాకిస్థాన్ లాక్‌డౌన్ అంచున ఉన్నట్టు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే ఆ దేశంలో నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. పెట్రోల్, డీజిల్ నిల్వలు కూడా అడుగంటినట్టు వార్తలు వస్తున్నాయి.


ఇవి కూడా చదవండి..

స్థిరంగా వెండి, బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..


అమెరికా అధ్యక్షుడికి వ్యతిరేకంగా నో కింగ్స్ నిరసన..

Updated Date - Mar 29 , 2026 | 09:42 AM