Share News

అమెరికా రహస్య స్థావరాలపై దాడులు.. అమెరికాకు భారీ ప్రాణనష్టం: ఇరాన్

ABN , Publish Date - Mar 29 , 2026 | 08:38 AM

దుబాయ్‌లోని అమెరికాకు చెందిన రెండు రహస్య స్థావరాలపై దాడులు చేసినట్టు ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ వెల్లడించింది. ఆ రహస్య స్థావరాల్లో దాదాపు 500 మంది అమెరికా సైనికులు ఉన్నారని, భారీ ప్రాణనష్టం సంభవించిందని ఐఆర్‌జీసీ వెల్లడించింది.

అమెరికా రహస్య స్థావరాలపై దాడులు.. అమెరికాకు భారీ ప్రాణనష్టం: ఇరాన్
Iran Dubai attack

దుబాయ్‌లోని అమెరికాకు చెందిన రెండు రహస్య స్థావరాలపై దాడులు చేసినట్టు ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ (IRGC) వెల్లడించింది. ఆ రహస్య స్థావరాల్లో దాదాపు 500 మంది అమెరికా సైనికులు ఉన్నారని, భారీ ప్రాణనష్టం సంభవించిందని ఐఆర్‌జీసీ వెల్లడించింది. ఒక స్థావరంలో 400 మంది సైనికులు, మరో స్థావరంలో 100 మంది సైనికులు ఉన్నారని పేర్కొంది (Iran Dubai attack).


ఆ రెండు స్థావరాలపైనా క్షిపణి, డ్రోన్‌లతో విరుచుకుపడినట్టు ఐఆర్‌జీసీ వెల్లడించింది. ఆ రెండు స్థావరాలపై దాడుల నేపథ్యంలో అమెరికా సైనికులకు తీవ్ర ప్రాణనష్టం తప్పదనే విషయం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు అక్కడి సైనిక కమాండర్లకు అర్థమయ్యే ఉంటుందని ఐఆర్‌జీసీ కమాండర్ పేర్కొన్నారు. వాళ్లకు లొంగిపోవడం తప్ప మరో మార్గం లేదన్నారు. కాగా, తాజా దాడుల నేపథ్యంలో గాయపడిన అమెరికన్ సైనికులను రక్షించేందుకు దుబాయ్‌లోని అంబులెన్స్‌లు గంటల తరబడి పనిచేశాయని ఇరాన్ మీడియా వెల్లడించింది (US troops casualties).


మరోవైపు గల్ఫ్ దేశాలకు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే (Iran warning US). గల్ఫ్ దేశాలపై దాడులు ఆగాలన్నా, ప్రశాంతత నెలకొని అభివృద్ధి జరగాలన్నా తమ మాట వినాల్సిందేనని తేల్చి చెప్పారు. తమ గగన తలాలను వినియోగించుకుని ఇరాన్‌పై దాడులు చేస్తున్న అమెరికా, ఇజ్రాయెల్‌కు గల్ఫ్ దేశాలు అనుమతి నిరాకరించాలని పెజెష్కియాన్ పిలుపునిచ్చారు. అప్పుడే దాడులు ఆగుతాయని స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి..

స్థిరంగా వెండి, బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..


అమెరికా అధ్యక్షుడికి వ్యతిరేకంగా నో కింగ్స్ నిరసన..

Updated Date - Mar 29 , 2026 | 09:12 AM