Share News

అమెరికా అధ్యక్షుడికి వ్యతిరేకంగా నో కింగ్స్ నిరసన..

ABN , Publish Date - Mar 29 , 2026 | 07:26 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలను వ్యతిరేకిస్తూ అమెరికా ప్రజలు భారీ సంఖ్యలో 'నో కింగ్స్' నిరసనలు చేపట్టారు. ట్రంప్ వెంటనే తన పదవిని వీడాలని డిమాండ్ చేశారు. ఇది అమెరికా చరిత్రలోనే అతిపెద్ద నిరసనగా మారుతుందని నిర్వాహకులు తెలిపారు.

అమెరికా అధ్యక్షుడికి వ్యతిరేకంగా నో కింగ్స్ నిరసన..
No Kings protest

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలను వ్యతిరేకిస్తూ అమెరికా ప్రజలు భారీ సంఖ్యలో 'నో కింగ్స్' నిరసనలు చేపట్టారు. ట్రంప్ వెంటనే తన పదవిని వీడాలని డిమాండ్ చేశారు. ఇది అమెరికా చరిత్రలోనే అతిపెద్ద నిరసనగా మారుతుందని, దీనికి మిన్నెసోటా కేంద్ర బిందువుగా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు. న్యూయార్క్, లాస్ ఏంజెలిస్, వాషింగ్టన్, మిన్నెసోటాలోని జంట నగరాలలో ప్రధాన ర్యాలీలు జరిగాయి (No Kings protest).


అమెరికా వ్యాప్తంగా 50 రాష్ట్రాలలో 3,100 ప్రదర్శనలు నిర్వహించామని, వీటిలో మొత్తం 90 లక్షల మంది పాల్గొన్నారని నిర్వాహకులు తెలిపారు. గత జూన్‌లో జరిగిన తొలి ఉద్యమంతో పోలిస్తే, ఈ నిరసనలో పాల్గొన్నవారి సంఖ్య దాదాపు 40 శాతం పెరిగినట్లు తెలిపారు. ఈ ఏడాది చివర్లో యూఎస్ మధ్యంతర ఎన్నికలు జరగబోతున్నాయి. ఇడాహో, వ్యోమింగ్, మోంటానా, ఉటా వంటి రిపబ్లికన్ మొగ్గు ఉన్న రాష్ట్రాల వారు కూడా తాజా నిరసనల్లో భారీగా పాల్గొన్నట్టు నిర్వాహకులు తెలిపారు (Anti Trump rallies).


నాలుగు వారాలుగా కొనసాగుతున్న ఇరాన్ యుద్ధంపై వ్యతిరేకత కూడా ఈ తాజా ప్రదర్శనలకు పాక్షికంగా కారణమని నిర్వాహకులు తెలిపారు (America protests). 'లాభాల కోసం యుద్ధమా? మా సైనికులు అమ్మకానికి లేరు' అంటూ నిరసనకారులు నినాదాలు చేశారు. కాగా, ఈ నిరసనలను వైట్‌హౌస్ తోసిపుచ్చింది. ఇవి ప్రజల మద్దతు లేని వామపక్షాల ఆధ్వర్యంలో జరిగాయని పేర్కొంది.


ఇవి కూడా చదవండి...

సరిగ్గా 11:11 నిమిషాలకు అమరావతి చట్టబద్ధత బిల్లును ప్రవేశపెట్టిన చంద్రబాబు

అమరావతి ఉద్యమంలో మహిళల పోరాటంపై హోంమంత్రి ప్రశంసలు

Updated Date - Mar 29 , 2026 | 07:40 AM