ఆర్సీబీ విలువలో 0.5శాతం మా దేశ క్రికెట్‌కు ఇచ్చినా చాలు: నెదర్లాండ్స్ క్రికెటర్
ABN , Publish Date - Mar 25 , 2026 | 12:42 PM
ఐపీఎల్‌లో వేల కోట్ల రూపాయిల డీల్స్ జరుగుతున్న వేళ అసోసియేట్ దేశాల క్రికెట్ పరిస్థితిపై మరోసారి చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో నెదర్లాండ్స్ క్రికెటర్ పాల్ వాన్ మీకెరెన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌లో వేల కోట్ల రూపాయిల డీల్స్ జరుగుతున్న వేళ అసోసియేట్ దేశాల క్రికెట్ పరిస్థితిపై మరోసారి చర్చ మొదలైంది. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్లు భారీ ధరకు అమ్ముడైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆర్సీబీని రూ.16,706 కోట్ల ధరకు కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలో నెదర్లాండ్స్ క్రికెటర్ పాల్ వాన్ మీకెరెన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
‘ఆర్సీబీ అమ్ముడైన మొత్తంలో 0.5శాతాన్ని వెచ్చించినా చాలు నెదర్లాండ్స్ క్రికెట్ గతి మారుతుంది. వారు ఆ మొత్తాన్ని ఇవ్వగలిగితే, మేం పూర్తి స్థాయి సభ్యులతో అంతరాన్ని తగ్గించి ఈ క్రీడను మరింత ప్రపంచవ్యాప్తం చేయగలం’ అని వాన్ సోషల్ మీడియా వేదకిగా పోస్ట్ పెట్టాడు. ఇది కాస్త ఇప్పుడు వైరల్‌గా మారింది. నెదర్లాండ్స్ వంటి అసోసియేట్ దేశాల జట్లు ప్రతిభ ఉన్నప్పటికీ ఆర్థిక పరిమితుల వల్ల వెనుకబడుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో నిలదొక్కుకోవడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, అవకాశాలు తక్కువగా ఉండటం ప్రధాన సమస్యగా మారిందంటూ క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
18 ఏళ్ల క్రితం రాజస్థాన్ రాయల్స్‌తో డీల్.. ఇప్పుడు షేన్ వార్న్ వాటా విలువ ఎంతో తెలుసా?
ఐపీఎల్ అభివృద్ధిని చూస్తే ఆశ్చర్యమేస్తోంది: సౌరభ్ గంగూలీ