Share News

టీమిండియా కంటే ఐపీఎల్‌కు జట్టును తయారుచేయడమే చాలా కష్టం: గంగూలీ

ABN , Publish Date - Mar 25 , 2026 | 11:53 AM

ఐపీఎల్ 2026 మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్ మిచెల్ స్టార్క్ ఆడే విషయంలో అనిశ్చితి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సౌరభ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు.

టీమిండియా కంటే ఐపీఎల్‌కు జట్టును తయారుచేయడమే చాలా కష్టం: గంగూలీ
Sourav Ganguly

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. అయితే పలువురు విదేశీ ప్లేయర్లు ఇప్పటికీ ఆయా జట్లతో చేరలేదు. ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్ మిచెల్ స్టార్క్ ఆడే విషయంలో అనిశ్చితి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సౌరభ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. నాణ్యమైన ఆటగాళ్లు చివరి నిమిషంలో జట్టుకు దూరమైతే.. టీమ్ బ్యాలెన్స్ మీద అది ప్రభావం చూపిస్తుందని తెలిపాడు.


‘భారత జట్టును తయారు చేయడం కంటే.. ఐపీఎల్‌కు జట్టును రూపొందించడమే చాలా కష్టం. ఎందుకంటే భారత జట్టుకు అత్యున్నత ఆటగాళ్లు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారు. ఐపీఎల్‌లో 10 జట్లున్నాయి. నాణ్యమైన క్రికెటర్లు పాల్గొనకపోతే జట్టు సమతూకం దెబ్బతింటుంది. జట్టుకు ఎవరైనా ఆటగాడు దూరమైనప్పుడు ప్రత్యామ్నాయ క్రికెటర్ల లభ్యత ఇబ్బంది పెడుతుంది. ఐపీఎల్‌కు మిచెల్ స్టార్క్, పతిరన దూరమైతే.. ఆ లోటును పూరించడం చాలా కష్టం’ అని గంగూలీ అన్నాడు. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌పైన కూడా దాదా మాట్లాడాడు. ‘పనిభారం నిర్వహణ చాలా ముఖ్యం. ఎందుకంటే ఆటగాళ్లు చాలా క్రికెట్ ఆడుతారు. శారీరక శ్రమ కంటే మానసిక అంశమే ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇంటికి, కుటుంబాలకు దూరంగా ఉండటం ఎప్పుడూ సులభమైన విషయం కాదు’ అని గంగూలీ పేర్కొన్నాడు.


ఇవి కూడా చదవండి:

18 ఏళ్ల క్రితం రాజస్థాన్ రాయల్స్‌తో డీల్‌.. ఇప్పుడు షేన్ వార్న్‌ వాటా విలువ ఎంతో తెలుసా?

ఐపీఎల్ అభివృద్ధిని చూస్తే ఆశ్చర్యమేస్తోంది: సౌరభ్ గంగూలీ

Updated Date - Mar 25 , 2026 | 11:53 AM