ఆర్సీబీ కొత్త ఛైర్మన్‌గా ఐపీఎల్ మాజీ ప్లేయర్.. అసలెవరీ ఆర్యమాన్ బిర్లా?
ABN , Publish Date - Mar 25 , 2026 | 08:16 AM
ఏకంగా రూ.16,706 కోట్ల ధరకు ఆర్సీబీని ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా, బోల్ట్ వెంచర్స్, బీఎక్స్‌పీఈ-బ్లాక్‌స్టోన్ సంస్థలు దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ డీల్ తర్వాత ఆర్సీబీకి ఆర్యమాన్ బిర్లా కొత్త ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌లో అత్యంత ఫ్యానిజం కలిగిన జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకటి. లీగ్ ఆరంభం నుంచి ఆర్సీబీ నడిపిస్తున్న యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్(యుఎస్ఎస్) సంస్థ.. ఏకంగా రూ.16,706 కోట్ల ధరకు ఆర్సీబీని అమ్మేసింది. ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా, బోల్ట్ వెంచర్స్, బీఎక్స్‌పీఈ-బ్లాక్‌స్టోన్ సంస్థలు కలిసి ఈ ఫ్రాంచైజీని దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ డీల్ తర్వాత ఆర్సీబీకి ఆర్యమాన్ బిర్లా కొత్త ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. మరి ఎవరీ ఆర్యమాన్ బిర్లా.. ఈయన బ్యాగ్రౌండ్ ఏంటనే దానిపై అభిమానులు చర్చించుకుంటున్నారు.
ఎవరీ ఆర్యమాన్ బిర్లా?
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆదిత్య బిర్లా గ్రూప్ అధినేత కుమార మంగళం బిర్లా కుమారుడే ఈ ఆర్యమాన్ బిర్లా. 28 ఏళ్ల ఆర్యమాన్ ఒకప్పుడు క్రికెటర్‌గా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. దేశవాళ్లీల్లో మధ్యప్రదేశ్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన అతడు.. 9 మ్యాచుల్లో 414 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ కూడా ఉంది. 2018 ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ ఆర్యమాన్‌ను రూ.30 లక్షల బేస్ ప్రైజ్‌తో కొనుగోలు చేసింది. అయితే అతడికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. తరువాత 2020 సీజన్‌కు ముందు ఆర్ఆర్ ఆర్యమాన్‌ను రిలీజ్ చేసింది. ఆ తర్వాత డొమెస్టిక్‌లోనూ, ఐపీఎల్‌లోనూ అవకాశాలు రాలేదు. దీంతో కెరీర్ మధ్యలోనే తీవ్రమైన ఒత్తిడి కారణంగా క్రికెట్‌కు విరామం ప్రకటించాడు.
ఆర్యమాన్ ప్రస్తుతం ఆదిత్య బిర్లా మేనేజ్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో డైరెక్టర్‌గా కొనసాగుతున్నాడు. వ్యాపార రంగంలో అనుభవం సంపాదిస్తూ ఇప్పుడు ఆర్సీబీని ముందుకు నడిపే బాధ్యతలను చేపట్టనున్నాడు. ఆర్సీబీని కొనుగోలు చేయడంపై ఆర్యమాన్ స్పందించాడు. ‘ఆర్సీబీ తదుపరి దశ అభివృద్ధికి భాగస్వామ్యం కావడం గర్వంగా ఉంది’ అని ఆర్యమాన్ తెలిపాడు.
ఇవి కూడా చదవండి:
థామస్ కప్2026: భారత్ జట్టుకు సారథ్యం వహించనున్న లక్ష్య సేన్
ఐపీఎల్ చరిత్రలో భారీ డీల్.. చేతులు మారిన రాజస్థాన్ రాయల్స్