Share News

ఐపీఎల్ 2026: ధోనీ రిటైర్‌మెంట్‌.. దాదా ఏమన్నాడంటే?

ABN , Publish Date - Mar 25 , 2026 | 06:47 AM

ప్రతి ఐపీఎల్ సీజన్ ఆరంభానికి ముందు అందరిదీ ఒకటే ప్రశ్న.. ధోనీకిదే ఆఖరి సీజనా? తాజాగా అతడి రిటైర్‌మెంట్‌పై మళ్లీ చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ధోనీ భవిష్యత్తుపై టీమిండియా క్రికెట్ దిగ్గజం సౌరభ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఐపీఎల్ 2026: ధోనీ రిటైర్‌మెంట్‌.. దాదా ఏమన్నాడంటే?
MS Dhoni

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా స్టార్ క్రికెటర్ ఎంఎస్ ధోనీ ఐపీఎల్‌లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రతి సీజన్ ఆరంభానికి ముందు అందరిదీ ఒకటే ప్రశ్న.. ధోనీకిదే ఆఖరి సీజనా? తాజాగా అతడి రిటైర్‌మెంట్‌పై మళ్లీ చర్చ మొదలైంది. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ 44 ఏళ్ల వయసులో 19వ ఐపీఎల్ సీజన్‌లో అడుగుపెట్టనున్న ధోనీ భవిష్యత్తుపై టీమిండియా క్రికెట్ దిగ్గజం సౌరభ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


ఓ మీడియా కార్యక్రమంలో ధోనీపై రిటైర్‌మెంట్‌పై దాదా స్పందించాడు. ఆ విషయంపై క్లారిటీ ఇవ్వకుండా చురుకుగా సమాధానం చెప్పాడు. ‘ధోనీ రిటైర్ అవ్వాలా? వద్దా? ఏం చేయాలనే విషయంపై నేను ధోనీకి చెబుతాను.. మీడియా కాదు’ అని వ్యాఖ్యానించారు. దీంతో వీరిద్దరి మధ్య త్వరలోనే కీలక చర్చ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.


ధోనీకిదే ఆఖరి సీజన్: ఆకాశ్ చోప్రా

ధోనీ రిటైర్‌మెంట్ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కూడా స్పందించాడు. అతడికిదే ఆఖరి సీజన్ కావొచ్చని అభిప్రాయపడ్డాడు. ‘ధోనీ ఈ సీజన్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గానే కొనసాగితే రిటైర్‌మెంట్ గురించి ఆలోచించాల్సిందే. మైదానంలోనే ఉండి మ్యాచ్‌ను నడిపించే ధోనీ ప్రత్యేకతే అతడి బలం. డగౌట్‌లో ఉండి జట్టును నడిపించడం కష్టం. అందులోనూ ధోనీ తర్వాత వికెట్ కీపర్‌గా బాధ్యతలు చేపట్టేందుకు సంజు శాంసన్ సిద్ధంగా ఉన్నాడు. ఫిట్‌నెస్.. ముఖ్యంగా మెకాలి సమస్యలపై ఆధారపడి ధోనీ తన భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.


ఇవి కూడా చదవండి:

థామస్ కప్‌2026: భారత్ జట్టుకు సారథ్యం వహించనున్న లక్ష్య సేన్

ఐపీఎల్ చరిత్రలో భారీ డీల్.. చేతులు మారిన రాజస్థాన్ రాయల్స్

Updated Date - Mar 25 , 2026 | 07:17 AM