Share News

హంపిది తప్పు నిర్ణయం

ABN , Publish Date - Mar 25 , 2026 | 05:25 AM

ప్రతిష్ఠాత్మక క్యాండిడేట్‌ చెస్‌ టోర్నీ నుంచి భారత జీఎం కోనేరు హంపి వైదొలగడాన్ని సైప్రస్‌ చెస్‌ సమాఖ్య చీఫ్‌ క్రిటో టోర్నారిటిస్‌ తప్పుబట్టాడు...

హంపిది తప్పు నిర్ణయం

సైప్రస్‌ చెస్‌ చీఫ్‌

న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక క్యాండిడేట్‌ చెస్‌ టోర్నీ నుంచి భారత జీఎం కోనేరు హంపి వైదొలగడాన్ని సైప్రస్‌ చెస్‌ సమాఖ్య చీఫ్‌ క్రిటో టోర్నారిటిస్‌ తప్పుబట్టాడు. ఆమె తీసుకున్న ఈ తప్పు నిర్ణయం సాటిప్లేయర్లు, నిర్వాహకులను అవమానించే విధంగా ఉందన్నాడు. సైప్రస్‌ లో భద్రత లేదంటూ హంపి చేసిన వ్యాఖ్యలు చెస్‌కు తీవ్రనష్టం చేకూర్చే విధంగా ఉన్నాయన్నాడు. ఆమెది ‘బ్యాడ్‌ మూవ్‌’ అని క్రిటో పేర్కొన్నాడు. ఇరాన్‌-అమెరికా యుద్ధం నేపథ్యంలో శనివారం నుంచి జరిగే క్యాండిడేట్‌ చెస్‌ ఈవెంట్‌ నుంచి హంపి వైదొలిగింది. యుద్ధ వాతావరణంలో ప్రశాంతంగా ఎలా ఆడగలం? అని ప్రశ్నించింది. కాగా, ఈ టోర్నీకి 16 మంది జీఎంలు అర్హత సాధించగా.. హంపి మాత్రమే వైదొలగడం వివాదాస్పదమైంది. ఇతర భారత ప్లేయర్లు ప్రజ్ఞానంద, దివ్య దేశ్‌ముఖ్‌, వైశాలి బరిలో నిలవనున్నారు.

ఇవి కూడా చదవండి:

థామస్ కప్‌2026: భారత్ జట్టుకు సారథ్యం వహించనున్న లక్ష్య సేన్

ఐపీఎల్ చరిత్రలో భారీ డీల్.. చేతులు మారిన రాజస్థాన్ రాయల్స్

Updated Date - Mar 25 , 2026 | 05:25 AM