Share News

పెట్రోల్, డీజిల్ కొరత లేదు.. వదంతులు నమ్మకండి: కేంద్ర మంత్రి బండి సంజయ్ విజ్ఞప్తి

ABN , Publish Date - Mar 25 , 2026 | 11:48 AM

తెలంగాణ రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్ కొరత ఉందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మొద్దని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆయిల్ సంస్థల వద్ద సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయంటూ.. తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు.

పెట్రోల్, డీజిల్ కొరత లేదు.. వదంతులు నమ్మకండి: కేంద్ర మంత్రి బండి సంజయ్ విజ్ఞప్తి
Bandi Sanjay fuel statement,

హైదరాబాద్, మార్చి 25: తెలంగాణ రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్ కొరత ఉందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మొద్దని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆయిల్ సంస్థల వద్ద సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయంటూ.. తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. పెట్రోలు, డీజిల్ కొరత రాకుండా ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని తెలిపారు. కృత్రిమ కొరత సృష్టిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేయాలని కొన్ని శక్తులు కుట్ర చేస్తున్నాయని, ఆ కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. వాహనదారులు రోజువారీ అవసరాల మేరకు.. పెట్రోలు, డీజిల్‌ను కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం ఉదయం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.


రాష్ట్రంలో వస్తున్న పుకార్లపై ఆయన స్పందిస్తూ.. ‘అమెరికా, ఇజ్రాయిల్ – ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్దం కారణంగా పెట్రోలు, డీజిల్ కొరత ఏర్పడిందంటూ సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదు. ఇండియన్ ఆయిల్, హెచ్ పీసీఎల్, బీపీసీఎల్ వంటి అన్ని పబ్లిక్ సెక్టార్ ఆయిల్ కంపెనీల వద్ద అవసరమైనంత స్టాక్ అందుబాటులో ఉంది. పెట్రోలు, డీజిల్ సరఫరాలోనూ లోపం లేదు. రాష్ట్ర అవసరాలకు సరిపడా పెట్రోలు, డీజిల్ సరఫరా నిరాటంకంగా కొనసాగుతోంది. ఇదే విషయాన్ని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోషియేషన్ కూడా స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మి చాలా మంది పెట్రోలు బంకుల వద్దకు పరుగులు తీస్తూ అవసరానికి మించి కొనుగోలు చేస్తున్నారు. దీనివల్ల ఒక్కసారిగా డిమాండ్ పెరగడంతో కొన్ని పెట్రోలు బంకుల్లో తాత్కాలికంగా కొరత ఏర్పడుతోంది. ఇదే అదనుగా కొంతమంది కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్ దందాకు పాల్పడే ప్రమాదం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వదంతులను నమ్మొద్దని ప్రజలకు విజ్ఝప్తి చేస్తున్నా’ అని అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

హైవేపై ట్రావెల్స్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం

నేటి నుంచి భగభగలే!

Read Latest Telangana News and National News

Updated Date - Mar 25 , 2026 | 12:44 PM