పగలు కూడా పొలాల్లోనే ఏనుగుల తిష్ట
ABN , Publish Date - Mar 26 , 2026 | 11:56 AM
చంద్రగిరి మండలం, ఎగువ కూచివారిపల్లె పంట పొలాల్లో పగలు కూడా ఏనుగులు తిష్ట వేస్తున్నాయి. దీంతో రైతులు విలవిలలాడిపోతున్నారు.
చంద్రగిరి(చిత్తూరు): చంద్రగిరి మండలం, ఎగువ కూచివారిపల్లె పంట పొలాల్లో పగలు కూడా ఏనుగులు తిష్ట వేస్తున్నాయి. దీంతో రైతులు విలవిలలాడిపోతున్నారు. కొన్ని రోజులుగా ఏనుగుల మంద గ్రామంలోని పంట పొలాలపై పడి బీభత్సం సృష్టిస్తోంది. సాధారణంగా రాత్రి వేళల్లో వచ్చే ఏనుగులు, ఇప్పుడు ఏకంగా పట్టపగలే పొలాల్లో తిష్టవేస్తుండటంతో రైతులు ప్రాణభయంతో వణికిపోతున్నారు. బుధవారం ఎగువ కూచువారిపల్లెలో సురేంద్ర నాయుడు, మునిచంద్ర, తదితర రైతుల పొలాల్లో ఏనుగులు మామిడి తోటలు,
ఇతర పంటలను తొక్కి వేయడమే కాకుండా, చెట్ల కొమ్మలను విరిచివేసి భారీ నష్టాన్ని కలిగించాయి. సాగునీటి పైపులను, మోటార్లను సైతం ధ్వంసం చేస్తున్నాయి. అటవీ శాఖ అధికారులు తక్షణమే స్పందించి ఏనుగులను అడవిలోకి మళ్లించేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. పంట నష్టపోయిన తమకు ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ఏపీలో ఇంటర్ సెకండియర్ సిలబస్ లీక్.. రంగంలోకి సైబర్ క్రైమ్ పోలీసులు
ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులు బంద్!
Read Latest Telangana News and National News