లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత పాపారావు
ABN, Publish Date - Mar 25 , 2026 | 07:13 AM
మావోయిస్టు అగ్రనేత పాపారావు పోలీసులకు లొంగిపోయారు. మంగళవారం నాడు 18మంది దళ సభ్యులతో కలిసి ఆయన ఛత్తీస్‌గఢ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు.
ఛత్తీస్‌గఢ్: మావోయిస్టు అగ్రనేత పాపారావు పోలీసులకు లొంగిపోయారు. మంగళవారం నాడు 18మంది దళ సభ్యులతో కలిసి ఆయన ఛత్తీస్‌గఢ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఏడుగురు మహిళలు ఉన్నట్లు సమాచారం. ఏ-47, ఎస్ఎల్ఆర్‌తోపాటు భారీ సంఖ్యలో ఆయుధాలు సమర్పించినట్లు తెలుస్తోంది. కాగా, అతనిపై రూ.25లక్షల రివార్డు ఉంది. 1997లో మావోయిస్టు పార్టీలో చేరిన పాపారావు.. ప్రస్తుతం దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. ఆయనది సుకుమా జిల్లా పుట్టపాడు గ్రామం. పామేడు ఏరియా కమిటీ కమాండర్‌గా పని చేస్తూ అతని భార్య ఊర్మిళ ఈ ఏడాది జనవరిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందారు. నేడు వారిని ఉపముఖ్యమంత్రి సమక్షంలో మీడియా ముందుకు తీసుకురానున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
1.23 ఎకరాల ప్రభుత్వ భూమికి హైడ్రా రక్షణ
ఆ ఏరియాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి కరెంట్ కట్
Updated at - Mar 25 , 2026 | 07:13 AM