Share News

ఏప్రిల్‌ 1 నుంచి చికెన్‌ షాపులు బంద్‌!

ABN , Publish Date - Mar 26 , 2026 | 05:23 AM

తెలంగాణ వ్యాప్తంగా చికెన్‌ షాపులను ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి బంద్‌ చేస్తామని రాష్ట్ర చికెన్‌ షాపుల ఓనర్స్‌ అసోసియేషన్‌ తెలిపింది. హైదరాబాద్‌లో బుధవారం జరిగిన సమావేశంలో..

ఏప్రిల్‌ 1 నుంచి చికెన్‌ షాపులు బంద్‌!

  • తెలంగాణ రాష్ట్ర చికెన్‌ షాప్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌

హైదరాబాద్‌ సిటీ, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ వ్యాప్తంగా చికెన్‌ షాపులను ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి బంద్‌ చేస్తామని రాష్ట్ర చికెన్‌ షాపుల ఓనర్స్‌ అసోసియేషన్‌ తెలిపింది. హైదరాబాద్‌లో బుధవారం జరిగిన సమావేశంలో అసోసియేషన్‌ ఈ మేరకు నిర్ణయించిందని ఎల్‌బీనగర్‌ చికెన్‌ షాప్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నెల్లుట్ల శేఖర్‌, ఉపాధ్యక్షుడు ఇందుర్తి కిరణ్‌కుమార్‌ తెలిపారు. చికెన్‌ షాపులకు ఇస్తున్న మార్జిన్‌ను పెంచాలని ఎన్నిసార్లు పౌల్ర్టీ కంపెనీలను కోరినా పట్టించుకోవడం లేదన్నారు. గతంలో ఇచ్చిన మార్జిన్‌ను కూడా ప్రస్తుతం తగ్గించడంతో చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. కంపెనీలు ఇచ్చే మార్జిన్‌ ఏమాత్రం సరిపోవడం లేదని, చికెన్‌ రేట్లు భారీగా పెరిగినా తమకు ఎలాంటి ఉపయోగం లేద ని ఆవేదన వ్యక్తం చేశారు. మార్జిన్‌ పెంచే వరకు రాష్ట్రవ్యాప్తంగా చికెన్‌ షాపుల యాజమానులు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొంటారని తెలిపారు.

Updated Date - Mar 26 , 2026 | 05:23 AM