ప్రజాసమస్యల పరిష్కారంలో ‘ఆంధ్రజ్యోతి’ది కీలక పాత్ర: ఎమ్మెల్యే పులివర్తి నాని
ABN , Publish Date - Mar 14 , 2026 | 01:23 PM
తిరుపతి జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారానికి మరో ముందడుగు పడింది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమం చంద్రగిరి మండలం రాయలపురం గ్రామంలో శనివారం నిర్వహించారు.
తిరుపతి జిల్లా, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): తిరుపతి జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారానికి మరో ముందడుగు పడింది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy) ఆధ్వర్యంలో ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమం చంద్రగిరి మండలం రాయలపురం గ్రామంలో ఈరోజు(శనివారం) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పులివర్తి నాని (Pulivarthi Nani), తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ (Venkateswar) పాల్గొని ప్రజల సమస్యలను నేరుగా విన్నారు. రాయలపురం, వెంకటంపల్లె గ్రామాల ప్రజలు తమ ప్రాంతంలో ఉన్న పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా గ్రామంలో ఉన్న మౌలిక వసతుల గురించి వివరించారు.
ప్రజలు ప్రస్తావించిన ముఖ్య సమస్యలు..
శ్మశానం ఏర్పాటు, డ్రైనేజీ వ్యవస్థ, సీసీ రోడ్ల నిర్మాణం, తాగునీటి కొరత వంటి తదితర సమస్యలను అధికారులు నేరుగా నమోదు చేసుకుని త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
చంద్రగిరి అభివృద్ధికి ప్రాధాన్యం: ఎమ్మెల్యే పులివర్తి నాని
చంద్రగిరి మండల అభివృద్ధికి మొదటి ప్రాధాన్యం ఇస్తానని ఎమ్మెల్యే పులివర్తి నాని (Pulivarthi Nani) హామీ ఇచ్చారు. గ్రామస్థులు చెప్పిన సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తానని మాటిచ్చారు. రాయలపురం, వెంకటంపల్లె గ్రామాల్లో శ్మశానం సమస్య పరిష్కరిస్తానని చెప్పుకొచ్చారు. ప్రజాసమస్యలను వెలుగులోకి తీసుకొచ్చి.. వాటి పరిష్కారంలో ఆంధ్రజ్యోతి కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణం, నెల రోజుల్లో తాగునీటి సమస్య పరిష్కరిస్తానని తెలిపారు. అదే విధంగా గ్రామంలో ఆర్వో (RO) యూనిట్ ఏర్పాటు చేసి ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని పేర్కొన్నారు. అలాగే గ్రామంలోని పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించడానికి తన సొంత నిధులను వినియోగిస్తానని ఎమ్మెల్యే పులివర్తి నాని హామీ ఇచ్చారు.
ప్రజాసమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తాం: కలెక్టర్ వెంకటేశ్వర్
రాయలపురం పంచాయతీలో ప్రజలు చెప్పిన సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ (Venkateswar) హామీ ఇచ్చారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమానంగా ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు. ఈ దిశగా అధికారులు సమన్వయంతో పని చేయాలని కూడా ఆదేశించారు. సీఎం చంద్రబాబు సూచనల మేరకు రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి రెండూ సమపాళ్లలో కొనసాగేలా అధికారులు కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి మీడియా పాత్రను కూడా అధికారులు ప్రశంసించారు. ముఖ్యంగా ఆంధ్రజ్యోతి ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తోందని కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు.
తాగునీటి సమస్య పరిష్కారానికి హామీ..
రాయలపురం పంచాయతీలో తాగునీటి సమస్యను త్వరలోనే పూర్తిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో ఆర్వో యూనిట్ ఏర్పాటు చేసి స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రకృతి సాగుతో అద్భుతాలు సృష్టిస్తున్నారు.. ఆ రైతుకు సీఎం చంద్రబాబు ప్రశంసలు
విద్యార్థులకు నాణ్యతలేని భోజనం.. మంత్రి లోకేశ్ ఆగ్రహం
ఉద్దానం కిడ్నీ బాధితులకు ప్రభుత్వం చారిత్రాత్మక పరిష్కారం.. తొలి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స
Read Latest AP News And Telangana News And International News And Telugu News