ఉద్దానం కిడ్నీ బాధితులకు ప్రభుత్వం చారిత్రాత్మక పరిష్కారం.. తొలి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స
ABN , Publish Date - Mar 13 , 2026 | 10:29 AM
శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంత ప్రజల దశాబ్దాల కల నెరవెరబోతోంది. కిడ్నీ వ్యాధులతో పోరాడుతున్న బాధితులకు అండగా నిలుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.
శ్రీకాకుళం, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంత ప్రజల దశాబ్దాల కల నెరవెరబోతోంది. కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు అండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలాసలో చారిత్రాత్మక అడుగు వేసింది. పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌లో రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా, తొలి కిడ్నీ మార్పిడి (Kidney Transplant) శస్త్రచికిత్సకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
హేమశ్రీకి పునర్జన్మ.. తొలి శస్త్రచికిత్స వివరాలివే..
ఈ చారిత్రక శస్త్రచికిత్సకు హేమశ్రీ అనే యువతి ఎంపికయ్యారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈ ఆపరేషన్‌ని ఈరోజు(శుక్రవారం) నిర్వహించనున్నారు. దేశంలోని ప్రముఖ కిడ్నీ మార్పిడి నిపుణులు ప్రత్యేకంగా పలాసకు విచ్చేసి స్థానిక వైద్యులతో కలిసి ఈ క్లిష్టమైన ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయనున్నారు.
ప్రభుత్వం నిధుల మంజూరు..
కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్యం అందించడమే ప్రధాన లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తోంది. పలాస సెంటర్ అభివృద్ధికి రూ.12 కోట్ల నిధులు మంజూరు చేసి, ఆపరేషన్ థియేటర్ల ఆధునికీకరణ, డయాలసిస్ యూనిట్లు, పోస్ట్ - ఆపరేటివ్ కేర్ సెంటర్లను బలోపేతం చేసింది. పేద రోగులకు ఎక్కువ ఖర్చుతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో పొందే కిడ్నీ మార్పిడి చికిత్సను పలాస కేంద్రంలోనే ప్రభుత్వం బాధ్యతగా నిర్వహిస్తోంది.
ఉద్దానం ప్రాంతానికి చేకూరనున్న ప్రయోజనాలు
గతంలో కిడ్నీ సమస్యల చికిత్స కోసం ఉద్దానం వాసులు విశాఖపట్నం, హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లేవారు. ఇప్పుడు పలాసలోనే ఈ సదుపాయం రావడం వల్ల ప్రయాణ భారం తగ్గుతోండటంతో పాటు అత్యవసర సందర్భాల్లో ప్రాణాలు కాపాడే అవకాశాలు మెరుగుపడతాయి. కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ద్వారా నిరంతరం స్క్రీనింగ్ పరీక్షలు, మందుల పంపిణీ జరుగుతుంది. పేద రోగులకు ప్రైవేట్ ఆస్పత్రులలో లక్షల రూపాయలు ఖర్చయ్యే చికిత్స ఇక్కడ ఉచితంగా లేదా రాయితీపై అందుబాటులో ప్రభుత్వం తీసుకువచ్చింది.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ హయాంలో పెట్టుబడిదారులను వేధించారు.. సీఎం చంద్రబాబు ధ్వజం
మంత్రి లోకేశ్ ప్రజాదర్బార్.. ప్రజాసమస్యల పరిష్కారం కోసం చర్యలు
గ్యాస్ సంక్షోభం.. ప్యానిక్ బుకింగ్‌తో సర్వర్లు డౌన్
Read Latest International News And Telangana News And AP News And Telugu News