మంత్రి లోకేశ్ ప్రజాదర్బార్.. ప్రజాసమస్యల పరిష్కారం కోసం చర్యలు
ABN , Publish Date - Mar 12 , 2026 | 10:10 AM
ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ విశాఖపట్నం జిల్లాలో గురువారం పర్యటించారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.
విశాఖపట్నం, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) విశాఖపట్నం జిల్లాలో ఈరోజు(గురువారం) పర్యటించారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 83వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. తనను కలిసేందుకు పార్టీ కార్యాలయానికి వచ్చిన ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నాయకులను మంత్రి ఆప్యాయంగా పలకరించారు. వివిధ సమస్యలతో బాధపడుతున్న ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించారు. లోకేశ్ దృష్టికి ప్రజలు పలు సమస్యలను తీసుకువచ్చారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు అన్నివిధాలా అండగా ఉంటామని మంత్రి నారా లోకేశ్ భరోసా ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వివేకా కేసు.. సునీత ఆ పిటిషన్ల తిరస్కరణ
భూ వివాదాలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు చర్యలు: మంత్రి అనగాని సత్యప్రసాద్
Read Latest International News And Telangana News And AP News And Telugu News