భూ వివాదాలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు చర్యలు: మంత్రి అనగాని సత్యప్రసాద్
ABN , Publish Date - Mar 11 , 2026 | 11:16 AM
భూ వివాదాలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టామని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖల మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యానించారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్ శాఖల్లో స్పీడప్ డెలివరీపై దృష్టి పెట్టామని పేర్కొన్నారు.
అమరావతి, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): భూ వివాదాలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టామని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖల మంత్రి అనగాని సత్యప్రసాద్ (Minister Anagani Satyaprasad) వ్యాఖ్యానించారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్ శాఖల్లో స్పీడప్ డెలివరీపై దృష్టి పెట్టామని పేర్కొన్నారు. ఈరోజు(బుధవారం) అమరావతిలోని సచివాలయంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరిగింది. ఈ సమావేశంలో మంత్రి అనగాని పాల్గొని మాట్లాడారు. ఏపీలో సుమారు నాలుగున్నర కోట్ల ఎకరాల భూమి ఉంటే... అందులో 22ఏ నిషేధిత జాబితాలో కోటి 95 లక్షల ఎకరాల భూమి చేర్చారని ప్రస్తావించారు. గ్రామసభలు నిర్వహించి ప్రతి గ్రామంలోనూ నిషేధిత జాబితాలో ఉన్న భూముల వివరాలను అధికారులు ప్రకటించాలని సూచించారు.
అవగాహన కల్పించేలి..
ప్రతి రైతుకు తన భూమి గురించి అవగాహన కల్పించేలా కలెక్టర్లు పర్యవేక్షించాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశించారు. ప్రపంచమంతా యుద్దంతో విధ్వంసం జరుగుతుంటే.. ఏపీ మాత్రం అభివృద్ధి వైపు పరుగులు పెడుతోందని వ్యాఖ్యానించారు. ఏపీని మరింత ముందుకు నడిపించేందుకు స్పీడప్ డెలివరీ గవర్నెన్స్‌ను పెంచేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ పాలనలో వేగాన్ని పెంచుతూనే.. ప్రజలకు సర్కార్‌పై సంతృప్తిని కూడా పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు అన్ని శాఖల్లోనూ 90 శాతం ప్రజల సంతృప్తిని సాధించాలని.. రెవెన్యూ శాఖలో రిజిస్ట్రేషన్ సేవలపై ప్రజలు పూర్తి సంతృప్తిగా ఉన్నారని అన్నారు. భూ వివాదాలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు కలెక్టర్లు కూడా తమ అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలపాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రైతు భూమిని కాజేస్తారా.. బుగ్గనపై సీఎం చంద్రబాబు ధ్వజం
జగన్ హయాంలో ఐదేళ్లపాటు చెత్తపాలన సాగించారు.. మంత్రి నారాయణ ధ్వజం
Read Latest International News And Telangana News And AP News And Telugu News