వివేకా కేసు.. సునీత ఆ పిటిషన్ల తిరస్కరణ
ABN , Publish Date - Mar 11 , 2026 | 11:56 AM
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై సుప్రీంకోర్టులో ఈరోజు(బుధవారం) విచారణ జరిగింది. కడప వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డితో పాటు మిగతా వారి బెయిల్ రద్దు చేయాలంటూ వివేకా కుమార్తె సునీత దాఖలు చేసిన పిటీషన్లను సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది.
ఢిల్లీ, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై (YS Vivekananda Reddy Case) సుప్రీంకోర్టులో (Supreme Court) ఈరోజు (బుధవారం) విచారణ జరిగింది. కడప వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డితో పాటు మిగతా వారి బెయిల్ రద్దు చేయాలంటూ వివేకా కుమార్తె సునీత దాఖలు చేసిన పిటీషన్లను సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది. మూడో సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేసినట్లు న్యాయస్థానానికి సీబీఐ అధికారులు తెలిపారు.
తమ దర్యాప్తు పూర్తి చేసినట్లు సీబీఐ తరపు న్యాయవాది వెల్లడించారు. తాము లేవనెత్తిన అంశాలపై దర్యాప్తు జరగలేదని సుప్రీంకోర్టుకు సునీత తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వివరించారు. ఈ కేసుకు సంబంధించిన అన్ని విషయాలు, ఆధారాల కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించవచ్చని జస్టిస్ ఎంఎం సుందరేశ్ ధర్మాసనం స్పష్టం చేసింది. ట్రయల్ కోర్టులో సెక్షన్ 207 కింద దాఖలైన అన్ని పిటిషన్లపై నాలుగు వారాల్లో విచారణ ముగించి తీర్పు వెలువరించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
చార్జిషీట్ దాఖలు పూర్తి అయినందున నిందితుల బెయిల్ రద్దు పిటిషన్లపై విచారణ జరపాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. నిందితుల బెయిల్ రద్దు చేయాలని దర్యాప్తు సంస్థ, సునీత దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ఈ కేసులో ట్రయల్ త్వరగా పూర్తి చేయాలని ట్రయల్ కోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
రైతు భూమిని కాజేస్తారా.. బుగ్గనపై సీఎం చంద్రబాబు ధ్వజం
జగన్ హయాంలో ఐదేళ్లపాటు చెత్తపాలన సాగించారు.. మంత్రి నారాయణ ధ్వజం
Read Latest International News And Telangana News And AP News And Telugu News