Share News

జగన్ హయాంలో పెట్టుబడిదారులను వేధించారు.. సీఎం చంద్రబాబు ధ్వజం

ABN , Publish Date - Mar 12 , 2026 | 11:18 AM

ఏపీని పారిశ్రామిక హబ్‌గా మార్చేందుకు కృషి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సంపద సృష్టించి పేదలకు పంచాలని పేర్కొన్నారు.

జగన్ హయాంలో పెట్టుబడిదారులను వేధించారు.. సీఎం చంద్రబాబు ధ్వజం
AP CM Chandra babu Naidu

అమరావతి, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): ఏపీని పారిశ్రామిక హబ్‌గా మార్చేందుకు కృషి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( AP CM Chandra babu Naidu) వ్యాఖ్యానించారు. సంపద సృష్టించి పేదలకు పంచాలని పేర్కొన్నారు. సంపద సృష్టికి ఉన్న అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు. సీఎం అధ్యక్షతన రెండోరోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ సచివాలయంలో ప్రారంభమైంది. సూపర్‌ సిక్స్‌, సంక్షేమం, ఆదాయార్జన శాఖలు, విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ధి, పెట్టుబడుల అంశాలపై సీఎం చంద్రబాబు చర్చించారు. శాంతిభద్రతలపై ఎస్పీలతో మాట్లాడారు. ఆయా జిల్లాల వారీగా పెట్టుబడులు, ఉద్యోగావకాశాలను వివరించారు.


కలెక్టర్లు బాధ్యతగా వ్యవహరించాలి..

నీటిని సక్రమంగా వినియోగించుకోవాలని.. భవిష్యత్‌ తరాలకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అభివృద్ధి విషయంలో కలెక్టర్లు బాధ్యతగా వ్యవహరించాలని మార్గనిర్దేశం చేశారు. స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌పై కలెక్టర్లు దృష్టి పెట్టాలని సూచించారు. పరిశ్రమలు రాని జిల్లాల్లో పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలని అన్నారు. వనరులను సరైన రీతిలో ఉపయోగించుకోవాలని దిశానిర్దేశం చేశారు. వైసీపీ హయాంలో పెట్టుబడిదారులను వేధించారని ధ్వజమెత్తారు. జగన్ హయాంలో పారిశ్రామికవేత్తలను భయపెట్టారని, ఉన్న పరిశ్రమలను కూడా రాష్ట్రం నుంచి పారిపోయేలా చేశారని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

స్వదేశీ రక్షణ తయారీకి సాగర్ డిఫెన్స్ ప్రాజెక్ట్‌ ఊతం: మంత్రి నారాయణ

మంత్రి లోకేశ్ ప్రజాదర్బార్.. ప్రజాసమస్యల పరిష్కారం కోసం చర్యలు

Read Latest International News And Telangana News And AP News And Telugu News

Updated Date - Mar 12 , 2026 | 11:23 AM