Share News

స్వదేశీ రక్షణ తయారీకి సాగర్ డిఫెన్స్ ప్రాజెక్ట్‌ ఊతం: మంత్రి నారాయణ

ABN , Publish Date - Mar 12 , 2026 | 10:28 AM

నెల్లూరు జిల్లాలో సాగర్ డిఫెన్స్ అటానమస్ మారిటైమ్ షిప్‌బిల్డింగ్ సిస్టమ్స్ సెంటర్‌కు శంకుస్థాపన చేయడం రాష్ట్రానికి గర్వకారణమని మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు.

స్వదేశీ రక్షణ తయారీకి సాగర్ డిఫెన్స్ ప్రాజెక్ట్‌ ఊతం: మంత్రి నారాయణ
AP Minister Narayana

అమరావతి, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): నెల్లూరు జిల్లాలో సాగర్ డిఫెన్స్ అటానమస్ మారిటైమ్ షిప్‌బిల్డింగ్ సిస్టమ్స్ సెంటర్‌కు శంకుస్థాపన చేయడం రాష్ట్రానికి గర్వకారణమని ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ (AP Minister Narayana) వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే మొదటి కేంద్రంగా రూపుదిద్దుకోబోతున్న ఈ ప్రాజెక్టు భారతదేశ స్వదేశీ రక్షణ తయారీ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయనుందని పేర్కొన్నారు. ఈరోజు (గురువారం) నెల్లూరు జిల్లాలో మంత్రి నారాయణ పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.


ఈ ప్రాజెక్టు సముద్ర సాంకేతికతలో నూతన ఆవిష్కరణలకు దారి తీస్తూ, మత్స్యకార రంగం, పారిశ్రామిక నైపుణ్యాల అభివృద్ధికి ఊతమివ్వనుందని తెలిపారు. తీర ప్రాంత పర్యవేక్షణ, భద్రత, రక్షణ సిద్ధతను మరింత బలపరచడంలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషించనుందని చెప్పుకొచ్చారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును నెల్లూరు జిల్లా జువ్వలదిన్నేకు తీసుకురావటంలో కృషి చేసిన మంత్రి నారా లోకేశ్‌కు మంత్రి నారాయణ అభినందనలు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వివేకా కేసు.. సునీత ఆ పిటిషన్ల తిరస్కరణ

భూ వివాదాలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు చర్యలు: మంత్రి అనగాని సత్యప్రసాద్

Read Latest International News And Telangana News And AP News And Telugu News

Updated Date - Mar 12 , 2026 | 10:39 AM