విద్యార్థులకు నాణ్యతలేని భోజనం.. మంత్రి లోకేశ్ ఆగ్రహం
ABN , Publish Date - Mar 13 , 2026 | 12:44 PM
దేవుని చెరువు ఘటనపై మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యత తక్కువగా ఉందనే సమాచారం వచ్చిందని.. ఈ విషయంపై వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఎన్టీఆర్ జిల్లా, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం మండలం దేవునిచెరువు ప్రభుత్వ పాఠశాలలో గత మూడు నెలలుగా నాణ్యతలేని మధ్యాహ్న భోజనం అందిస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. భోజనం నాణ్యతగా లేదని విద్యార్థులు డస్ట్‌బిన్‌లో పారబోశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారి తీసింది.
ఈ ఘటనపై మంత్రి నారా లోకేశ్ ఆగ్రహం
ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యత తక్కువగా ఉందనే సమాచారం వచ్చిందని.. ఈ విషయంపై వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
విచారణకు త్రిసభ్య కమిటీ..
ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకోవడానికి త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. ఈ కమిటీ సమగ్రంగా విచారణ జరిపి నివేదిక సమర్పించనుందని వివరించారు. ఆ నివేదిక ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు.
చర్యలు ప్రారంభం..
ఈ ఘటనపై ఇప్పటికే కొన్ని ప్రాథమిక చర్యలు తీసుకున్నామని అన్నారు. భోజనం సరఫరా చేస్తున్న ఏజెన్సీని మార్చడంతో పాటు పాఠశాల హెడ్‌మాస్టర్‌పై కూడా చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ హయాంలో పెట్టుబడిదారులను వేధించారు.. సీఎం చంద్రబాబు ధ్వజం
మంత్రి లోకేశ్ ప్రజాదర్బార్.. ప్రజాసమస్యల పరిష్కారం కోసం చర్యలు
గ్యాస్ సంక్షోభం.. ప్యానిక్ బుకింగ్‌తో సర్వర్లు డౌన్
Read Latest International News And Telangana News And AP News And Telugu News