ప్రకృతి సాగుతో అద్భుతాలు సృష్టిస్తున్నారు.. ఆ రైతుకు సీఎం చంద్రబాబు ప్రశంసలు
ABN , Publish Date - Mar 13 , 2026 | 01:35 PM
ప్రకృతి వ్యవసాయంతో ఆదర్శంగా నిలుస్తున్న గుంటూరు జిల్లా రైతు రోశయ్యను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. రైతు రోశయ్య చేస్తున్న ప్రకృతి సాగును కొనియాడుతూ అభినందనలు తెలిపారు.
అమరావతి, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): ప్రకృతి వ్యవసాయంతో ఆదర్శంగా నిలుస్తున్న గుంటూరు జిల్లా రైతు రోశయ్యను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) ప్రశంసించారు. రైతు రోశయ్య చేస్తున్న ప్రకృతి సాగును కొనియాడుతూ అభినందనలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్(ట్విట్టర్) వేదికగా ట్వీట్ పెట్టారు.
75 సెంట్లలో 52 రకాల పంటలు..
గుంటూరు జిల్లా కొల్లిపర మండలం అత్తోట గ్రామానికి చెందిన రైతు రోశయ్య కేవలం 75 సెంట్ల భూమిలోనే 52 రకాల పంటలను సాగు చేస్తున్నారు. ప్రకృతి సేద్య పద్ధతులను అనుసరిస్తూ విభిన్న పంటలను పండించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. చిన్న స్థలంలోనే విభిన్న పంటలను సాగు చేసి మంచి ఆదాయం పొందడం ఆయన ప్రత్యేకతగా మారిందని తెలిపారు.
80 ఏళ్ల వయసులో స్ఫూర్తిదాయక ప్రయాణం..
రోశయ్య ప్రస్తుతం 80 ఏళ్ల వయసులో కూడా వ్యవసాయంలో చురుకుగా పనిచేస్తూ ప్రతి నెలా రూ.20 వేలకు పైగా ఆదాయం పొందుతున్నారని చెప్పుకొచ్చారు. చిన్న స్థలాన్ని సమర్థవంతంగా వినియోగించి, ప్రకృతి వ్యవసాయంతో విజయాన్ని సాధించడం యువ రైతులకు స్ఫూర్తినిస్తోందని పేర్కొన్నారు.
అద్భుతాలు సృష్టిస్తున్నారు..
‘భూమిని తల్లిలా భావించి ప్రకృతి సేద్యంతో అద్భుతాలు సృష్టిస్తున్న గుంటూరు జిల్లా అత్తోట గ్రామ రైతు రోశయ్యకి నా ప్రణామాలు. ఎనభై ఏళ్ల వయసులో కేవలం 75 సెంట్ల భూమిలో 52 రకాల పంటలు పండిస్తూ నెలకు రూ.20 వేలకుపైగా ఆర్జిస్తున్న ఆయన విజయగాథ నిజంగా స్ఫూర్తిదాయకం’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ప్రకృతి వ్యవసాయానికి ప్రేరణ..
2016లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు తీసుకున్న చర్యలతో ప్రేరణ పొందిన రోశయ్య, అప్పటినుంచి ప్రకృతి సాగును ప్రారంభించారని సీఎం తెలిపారు. అప్పటి నుంచి ఆయన సాధిస్తున్న విజయాలు ఇతర రైతులకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయని చెప్పుకొచ్చారు.
రైతులకు ఆదర్శం..
రోశయ్య వంటి రైతులు ప్రకృతి వ్యవసాయంతో తక్కువ భూమిలో కూడా ఎక్కువ లాభం పొందవచ్చని నిరూపిస్తున్నారని సీఎం తెలిపారు. రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరించి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఉత్పత్తి చేయడంతో పాటు మంచి ఆదాయం పొందవచ్చని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ హయాంలో పెట్టుబడిదారులను వేధించారు.. సీఎం చంద్రబాబు ధ్వజం
మంత్రి లోకేశ్ ప్రజాదర్బార్.. ప్రజాసమస్యల పరిష్కారం కోసం చర్యలు
గ్యాస్ సంక్షోభం.. ప్యానిక్ బుకింగ్‌తో సర్వర్లు డౌన్
Read Latest International News And Telangana News And AP News And Telugu News