DD Next Level Movie: డీడీ నెక్ట్స్ లెవల్ హీరో, నిర్మాతకు లీగల్ నోటీసులు
ABN, Publish Date - May 14 , 2025 | 01:08 PM
DD Next Level Movie: డీడీ నెక్స్ట్ లెవెల్ చిత్రంలో గోవింద నామాలతో అసభ్యంగా పాటను చిత్రీకరించడం దారుణమని బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. ఇలా చేయడం ద్వారా భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు.
తిరుమల, మే 14: డీడీ నెక్ట్స్ లెవెల్ చిత్రం (DD Next Level movie) హీరో, నిర్మాతకు బీజేపీ నేతలు లీగల్ నోటీసులు పంపించారు. శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా పాటను పేరడీ చేశారని టీటీడీ పాలకమండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి (Bhanu Prakash Reddy) మండిపడ్డారు. సినిమా హీరో, నిర్మాతలు భక్తులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని, లేదంటే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. డీడీ నెక్స్ట్ లెవెల్ చిత్రంలో గోవింద నామాలతో అసభ్యకరంగా పాటను చిత్రీకరించడం దారుణమన్నారు. ఇలా చేయడం ద్వారా భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని మండిపడ్డారు. చిత్ర హీరో సంతానం, నిహారిక నిర్మాణ సంస్థకు తమ లాయర్ ద్వారా నోటీసులు పంపామని తెలిపారు.
హిందువుల మనోభావాలను దెబ్బ తీసినందుకు రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తున్నట్లు నోటీసులో పంపామన్నారు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నాస్తిక ప్రభుత్వమని.. గోవింద నామాలతో పాట ఉన్న అడ్డుచెప్పలేదన్నారు. చిత్ర హీరో, నిర్మాణ సంస్థ 15 రోజుల్లో శ్రీవారి భక్తులకు క్షమాపణ చెప్పాలని.. లేదంటే క్రిమినల్ కేసులు పెట్టాలని ఫిర్యాదు చేస్తామని టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి వెల్లడించారు.
India VS Pakistan: భారత్-పాక్ కాల్పుల విరమణ.. పాకిస్తాన్‌పై చైనా గుర్రు.. కారణమిదే..
ఇదే అంశంపై జనసేన నేత కిరణ్ రాయల్ తిరుమలలో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పళణి స్వామికి కూడా ఆ పాటను వినిపించిన విషయం తెలిసిందే. అలాగే పోలీస్‌స్టేషన్‌లో కూడా ఆ పాటను వినిపించి ఫిర్యాదు ఇచ్చారు. ఈ సందర్భంగా తమిళనాడు సీఎం, ఆయన తనయుడిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిరువురూ నాస్తికులని, దేవుడిని నమ్మరంటూ వ్యాఖ్యలు చేశారు. మే 15న విడుదలయ్యే ఈ చిత్రాన్ని ప్రతీఒక్కరూ అడ్డుకోవాలని కిరణ్ రాయల్ పిలుపునిచ్చారు.
ఇదే క్రమంలో ఈరోజు బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి కూడా ఆ సినిమా హీరో, నిర్మాతకు లీగల్ నోటీసులు ఇచ్చారు. తమిళనాడులో ఉండే డీఎంకే ప్రభుత్వం ఇలాంటి వాటి పట్ల సరైన విధంగా స్పందించడం లేదని జనసేన, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం వల్ల స్వయంగా తాము చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. దీనిపై తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు స్పందించాల్సిన అవసరం శ్రీవారి భక్తులు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి
Justice Gavai oath ceremony: సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రమాణం
Adampur Airbase: అబద్ధాల ఫ్యాక్టరీ.. పాకిస్థాన్
Read Latest AP News And Telugu News
Updated Date - May 14 , 2025 | 01:09 PM