Chittoor man snake bite: అయ్యోపాపం సుబ్రహ్మణ్యం.. బాబోయ్ ఇదెక్కడి పగరా నాయనా
ABN, Publish Date - Mar 18 , 2025 | 01:26 PM
Chittoor man snake bite: ఏపీకి చెందిన ఓ వ్యక్తి వింత పరిస్థితిని ఎదుర్కుంటున్నాడు. గతకొన్నాళ్లుగా ఓ బాధ అతడిని వెంటాడుతూనే ఉంది. కూలీనాలి చేసుకుని బతికే అతడు.. ఆ బాధతో ఆస్పత్రి పాలవ్సాల్సి వస్తోంది.. ఇంతకీ అతను ఎదుర్కుంటున్న సమస్య ఏంటో చూద్దాం.
చిత్తూరు, మార్చి 18: పాములు పగబడతాయా అంటే.. ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నే అని అనుకోవాలి. కానీ పాములు పగబడతాయి అనడానికి అనేక సంఘటనలు లేకపోలేదు. అయినప్పటికీ పాములు పగబట్టవని కొందరు చెబుతుంటే.. పాములు పగబడతాయనేది వాస్తవం అని పలువురి వాదన. ఇదిలా ఉంటే... చిత్తూరు జిల్లాలో జరిగిన ఓ ఘటనను చూస్తే మాత్రం పాములు నిజంగానే పగబడతాయనడానికి నిదర్శనం అని చెప్పుకోవచ్చు. అతడిది నిరుపేద కుటుంబం. రోజూ కూలీ పనులకు వెళ్తే కానీ నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్లని పరిస్థితి. కానీ కొన్నేళ్లుగా అతడి ఓ కష్టం వెంటాడుతూనే ఉంది. అతడు వయస్సులో ఉన్నప్పటి నుంచి ఈ బాధను ఎదుర్కుంటున్నాడు. దీంతో అందరిలా చురుకుగా పనిచేసుకోలేని పరిస్థితి. ఎప్పుడూ ఆస్పత్రి పాలవుతూనే ఉంటాడు. కూలీ చేసుకుని బతికే అతడు ప్రతీసారీ ఆస్పత్రిలో చేరడం.. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న వ్యక్తి ఇలా మంచాన పడటంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయింది. ఇంతకీ ఆ వ్యక్తికి ఏం జరిగింది.. కొన్నాళ్లుగా వెంటాడుతున్న బాధ ఏంటి. ఇతడికి - పాముకు సంబంధం ఏంటి అనేది ఇప్పుడు స్టోరీలో చూద్దాం.
చిత్తూరు జిల్లా (Chttoor District) బైరెడ్డిపల్లె మండలం కుమ్మరగుంటకు చెందిన సుబ్రహ్మణ్యంది నిరుపేద కుటుంబం. కూలీ పనులు చేస్తూ భార్యా బిడ్డలను పోషిస్తుంటాడు. కానీ సుబ్రహ్మణంను గతకొన్నాళ్లుగా ఓ బాధ వెంటడుతూనే ఉంది. అదే పాము కాటు. గత కొన్నాళ్లు ఆ వ్యక్తి పాము కాటుకు గురవుతూనే ఉన్నాడు. ఒకసారి కాదు.. రెండు సార్లు కాదండోయ్.. పదుల సంఖ్యలో సుబ్రహ్మణ్యం పాములు కాటుకు గురయ్యాడు. అయినప్పటికీ అతడి బతికి బట్టకడుతున్నాడు. కానీ ఇలా ప్రతీ సారి పాము కాటుకు గురవడం, ఆస్పత్రి పాలవడంతో రోజు కూలీ కూడా చేయలేని స్థితిలోకి వెళ్లిపోయాడు అతడు. 20 ఏళ్ల వయసులో నుండే సుబ్రహ్మణ్యం పాము కాటుకు గురయ్యాడు. ఇప్పుడు సుబ్రహ్మణ్యంకు 50 ఏళ్లు. 20 ఏళ్ల వయస్సు నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతీ ఏడు ఆ నిరుపేద పాము కాటుకు గురవుతూనే ఉన్నాడు. చికిత్స పొందుతూనే ఉన్నాడు. ఇలా ప్రతీ సారి పాము కాటుతో ఆస్పత్రిలో చేరడంతో సంపాదించింది మొత్తం చికిత్సకే పెట్టుకోవాల్సిన దుస్థితికి వచ్చిందని అతడి భార్య వాపోయింది. అయితే సొంతూర్లో ఉంటే పాము కాటు తప్పడం లేదని భావించిన సుబ్రహ్మణ్యం.. ఆ ఊరుని వదిలి పదేళ్ల కిందటే బెంగుళూరుకు కుటుంబంతో సహా వెళ్లిపోయాడు. అయినప్పటికీ అతడిని పాములు వెంటాడం మానలేదు. దీంతో తిరిగి స్వగ్రామానికి వచ్చేసి ఓ కోళ్ల ఫారమ్‌లో పనికి కుదిరాడు. అప్పుడప్పుడు పొలం పనులకు వెళ్తూ ఉంటాడు. తాజాగా రెండు రోజుల క్రితం కూడా సుబ్రహ్మణ్యం పాముకు కాటుకు గురై ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు.
అయితే సుబ్రహ్మణ్యంను ఇన్ని సార్లు పాము కాటేయడానికి కారణాలేంటో అంతుచిక్కడం లేదు. అసలు పాములు అతడినే ఎందుకు వెంటాడుతున్నాయనేది ఎవరికీ అర్ధం కావడం లేదు. కానీ ఇలా ప్రతీసారీ పాముకాటుకు గురై వైద్యానికి డబ్బులు ఖర్చు అవడంతో ఆ కుటుంబం బాధ వర్ణణాతీతం అని చెప్పుకోవాలి. ఈ విషయం తెలసిన ప్రతిఒక్కరూ కూడా అయ్యో అనకుండా ఉండలేరు. పాము కాటుకు గురైనప్పుడల్లా తన భర్తను ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తోంది సుబ్రహ్మణ్యం భార్య శారదమ్మ. ఈ సమస్యకు పరిష్కారం ఏంటో తెలియక ఆ నిరుపేద కుటుంబం అల్లాడిపోతోంది.
ఇవి కూడా చదవండి...
DK Aruna Home Theft Case: డీకే అరుణ ఇంట్లో చోరీ కేసులో కీలక పరిణామం
Hyderabad crime news: పనిలో చేరిన 16 గంటల్లో ఊహించని షాకిచ్చిన మహిళ
Read Latest AP News And Telugu News
Updated Date - Mar 18 , 2025 | 01:38 PM