ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: కుప్పం రూపు రేఖలు మార్చేందుకు అద్భుతమైన ప్రణాళికలు

ABN, Publish Date - Jul 02 , 2025 | 06:35 PM

గత వైసీపీ ప్రభుత్వం విధ్వంసం చేసిన రాష్ట్రాన్ని వికాసం వైపుగా నడుపుతున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా కుప్పాన్ని తయారు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

AP CM Chandrababu in Kuppam

చిత్తూరు, జులై 02: బ్రాండ్ కుప్పం ఎస్టాబ్లిష్ చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గతంలో బ్రాండ్ కుప్పం అనేది లేదన్నారు. కానీ ప్రస్తుతం ఆ దిశగా కుప్పంలో తయారు చేసే ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పిస్తామని స్పష్టం చేశారు. బుధవారం కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. స్వర్ణ కుప్పం ప్రాజెక్టులో భాగంగా పలు అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలకు సీఎం చంద్రబాబు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం కుప్పంలో ప్రజావేదిక పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఎయిర్‌పోర్ట్ అంటేనే అభివృద్ధన్నారు. కుప్పంలో ఎయిర్‌పోర్ట్ రాబోతోందని తెలిపారు.

రూ. 850 కోట్లతో కుప్పం ఎయిర్‌పోర్ట్‌ను నిర్మిస్తామని చెప్పారు. అయితే ఈ ఎయిర్‌పోర్ట్‌కు భూములు ఇవ్వవద్దని కొందరు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారన్నారు. ఎయిర్‌పోర్ట్‌కు భూములు ఇచ్చిన వారికి మెరుగైన ప్యాకేజీ ఇస్తామని స్పష్టం చేశారు. రాజధాని అమరావతికి భూములిచ్చారని.. వారందరికి ప్యాకేజీ ఇచ్చామని గుర్తు చేశారు.

కుప్పంలో ప్రతి ఇంటిపై సోలార్ ప్యానెల్ ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ సోలార్ ప్యానెల్ పెట్టుకునేంత వరకు తాను.. మీ వెంట పడతానని పేర్కొన్నారు. ఇళ్లపై రూఫ్ టాప్ ద్వారా మనమే సొంతంగా విద్యుత్ తయారు చేసుకోవచ్చునని ప్రజలకు ఈ సందర్భంగా ఆయన వివరించారు. ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగానే పీఎం సూర్య ఘర్ పధకం కింద సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. బీసీలకు రాయితీ కింద సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. సూర్య ఘర్ పథకాన్ని పూర్తిగా వినియోగించుకుంటే కరెంటు కోతల పరిస్థితి ఉండదని.. అలాగే విద్యుత్ ఛార్జీలు కట్టే పరిస్థితి కూడా ఉండదన్నారు.

కుప్పంలో ఏసీల అవసరం ఉండదు కానీ.. అవసరమైతే ఏసీలకు సోలార్ విద్యుత్ పెట్టుకో వచ్చునని ఈ సందర్భంగా ప్రజలకు ఆయన సూచించారు. ఇళ్లకే కాదు వ్యవసాయానికి సైతం సోలార్ విద్యుత్ వినియోగించుకోవాలన్నారు. వ్యవసాయ మోటార్లకు సోలార్ ప్యానెళ్లు బిగించుకోవచ్చునని.. కేంద్ర ప్రభుత్వ పథకం కింద మోటార్లకు సోలార్ ప్యానెళ్లు బిగిస్తామని వివరించారు.

ఇక కుప్పం రైల్వే‌స్టేషన్ ఆధునీకరిస్తామన్నారు. చెన్నై, బెంగళూరు వెళ్లే వారికి ఇది మరింత సౌకర్యంగా ఉంటుందన్నారు. పలమనేరు నుంచి కృష్ణగిరి వరకు నాలుగు లేన్ల రహదారి నిర్మిస్తున్నామని తెలిపారు. కుప్పం నుంచి హోసూర్ వరకూ మరో సమాంతర రహదారి నిర్మిస్తామని ఆయన ప్రకటించారు. కృష్ణగిరి, బెంగళూరు, కోలార్, చెన్నైలకూ మధ్య కేంద్రంగా కుప్పం మారబోతుందని వివరించారు. కుప్పంలో బ్రహ్మండమైన అభివృద్ధి జరగబోతోందన్నారు. కుప్పం రూపురేఖలు మార్చేందుకు ఒక అద్భుతమైన ప్రణాళిక తయారు చేశామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.

గత వైసీపీ ప్రభుత్వం విధ్వంసం చేసిన రాష్ట్రాన్ని వికాసం వైపుగా నడుపుతున్నామన్నారు. సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా మీ ముందుకు వచ్చానని వివరించారు. దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా కుప్పాన్ని తయారు చేస్తామని స్పష్టం చేశారు. రూ. 3,890 కోట్ల వ్యయంతో హంద్రినీవా పనులు పూర్తి చేస్తున్నామన్నారు. కుప్పంలో చివరి ఆయకట్టు వరకూ నీళ్లు తీసుకు వస్తామని ప్రజలకు ఆయన భరోసా ఇచ్చారు.

ఈ ఏడాదిలోనే కుప్పం నియోజకవర్గానికి హంద్రీనీవా నీళ్లు పారిస్తామన్నారు. అభివృద్ధి చేసే వారికి మాత్రమే సంక్షేమం గురించి మాట్లాడే హక్కు ఉంటుందని తెలిపారు. అప్పు చేసి సంక్షేమం చేస్తామనటం ఏం పరిపాలన..? అని ప్రశ్నించారు. అప్పు తెచ్చి అభివృద్ధి చేసి.. దీని ద్వారా వచ్చిన ఆదాయాన్ని సంక్షేమానికి ఖర్చు చేయటమే నిజమైన ఆర్ధిక వ్యవస్థ అని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు అభివర్ణించారు.

తమ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ది కార్యాక్రమాలను సమానంగా చేస్తున్నామని వివరించారు. వచ్చిన ఆదాయం పేద వారికి కేటాయించాలి.. అలాగే అదే సమయంలో అభివృద్ధి కూడా చేయాల్సి ఉందన్నారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. ఈ సారి జరిగిన విధ్వంసాన్ని తలచుకుంటేనే భయం వేస్తోందన్నారు. రూ. 10 లక్షల కోట్ల అప్పులు చేశారని.. దీంతో అసలూ, వడ్డీలు కలిపి కట్టాల్సి వస్తుందన్నారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలూ పడ కేసేలా గత ప్రభుత్వం చేసిందని చెప్పారు.

కేంద్రం ఇచ్చిన డబ్బుల్ని కూడా వేరే వాటికి ఖర్చు పెట్టేసి వివిధ పథకాలను అస్తవ్యస్తం చేసిందంటూ గత ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రజల్ని కష్ట పెట్టకూడదన్న లక్ష్యంతోనే సంక్షేమ కార్యక్రమాల్ని కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. కొవ్వూరు నియోజకవర్గంలో ఓ చర్మకారుడిని పలకరించి, డప్పు కళాకారులకిచ్చే పెన్షన్ ఇచ్చాను.. ఇది నాకు చాలా ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. ఏ రాష్ట్రమూ ఏపీలో ఇస్తున్నంత పెన్షన్ ఇవ్వడం లేదన్నారు.

కుప్పం పక్కనే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలున్నాయని.. అక్కడా ఇలా పెన్షన్లు ఇవ్వడం లేదని గుర్తు చేశారు. దివ్యాంగులకు 12 రెట్ల మేర పెంచి పెన్షన్ ఇస్తున్నామన్నారు. కిడ్నీ తదితర వ్యాధిగ్రస్తులకు సైతం తమ ప్రభుత్వం సాయం చేస్తోందని వివరించారు. మంచానికే పరిమితమైన వారికి రూ. 15 వేలు ఇస్తున్నామని పేర్కొన్నారు. మీ ఇంటికి పెద్ద కొడుకు తరహాలో సేవ చేస్తున్నానన్నారు. కష్టాల్లో ఉన్న ప్రజల్ని ఆదుకోవటం కూటమి ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. ఎంత మంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం పథకం అమలు చేశామన్నారు.

ఐదుగురు పిల్లలుంటే ఒకే సారి రూ.75 వేలు చెల్లించామని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఈ పథకాన్ని అమలు చేస్తూనే ఉంటామని పేర్కొన్నారు. రైతులకు అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు చెల్లిస్తామన్నారు. గత ప్రభుత్వం రూ.7,500 మాత్రమే ఇచ్చిందని గుర్తు చేశారు. దానికి రెట్టింపుగా కూటమి ప్రభుత్వం చెల్లిస్తోందన్నారు.

దీపం కింద గ్యాస్ పథకం, పెంచిన పెన్షన్లు, తల్లికి వందనం కింద పిల్లలందరికీ ఆర్ధికసాయం చేశామని చెప్పారు. ఏ నాయకుడు ప్రజలకు అండగా నిలుస్తారో.. జీవితాల్లో వెలుగులు నింపుతారో వారినే ఆదరించాలన్నారు. రాష్ట్రంలో అర్హులందరికీ పెన్షన్లు ఇవ్వాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం చంద్రబాబు తెలిపారు.

ఇవి కూడా చదవండి..

ఐపీఎస్‌కి రాజీనామా.. ఎందుకంటే..

సంచలన విషయాలు వెల్లడించిన ఈడీ

For More AP News And Telugu News..

Updated Date - Jul 02 , 2025 | 08:03 PM