ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Crime Investigation: చంపేద్దాం లద్దాఖ్‌ చెక్కేద్దాం

ABN, Publish Date - Jun 25 , 2025 | 03:54 AM

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ప్రైవేట్‌ సర్వేయర్‌ తేజేశ్వర్‌ హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

  • ముందు భార్యను చంపాలని తిరుమలరావు ప్లాన్‌

  • తర్వాత ఐశ్వర్యతో అక్కడే సహజీవనానికి ఏర్పాట్లు

  • కుదరకపోవడంతో తేజేశ్వర్‌ వైపు ప్రణాళిక

  • హత్య కేసులో వెలుగులోకి వస్తున్న కొత్త విషయాలు

గద్వాల క్రైం, జూన్‌ 24(ఆంధ్రజ్యోతి): రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ప్రైవేట్‌ సర్వేయర్‌ తేజేశ్వర్‌ హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రఽధాన నిందితులైన తేజేశ్వర్‌ భార్య ఐశ్వర్య, ఆమె ప్రియు డు తిరుమలరావుతో పాటు మరికొందరిని పోలీసులు విచారిస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. తేజేశ్వర్‌ హత్య కన్నా ముందు తన భార్యను హతమార్చేందుకు బ్యాంక్‌ మేనేజర్‌ తిరుమలరావు ప్లాన్‌ వేశాడు. భార్యను హత్య చేసి ప్రియురాలు ఐశ్వర్యతో లద్దాఖ్‌ వెళ్లి, అక్కడే సహజీవనం చేసేందుకు స్కెచ్‌ వేశాడట! ఇందుకోసం పలు కారణాల పేరిట బ్యాంకు నుంచి రూ.20 లక్షల లోన్‌ కూడా తీసుకున్నాడు.

ప్రియురాలిపై ఉన్న ఇష్టంతో పాటు తన భార్యకు సంతానం కలగకపోవడంతో తిరుమలరావు ఆమెను చంపేయాలని ప్లాన్‌ వేసినట్లు తెలిసింది. అయితే ముందు నుంచి వీరిద్దరి సంబంధం గురించి తెలిసిన తిరుమలరావు భార్య జాగ్రత్త పడడంతో హత్య ప్రణాళిక తేజేశ్వర్‌ వైపు మళ్లింది. ప్లాన్‌ వివరాలను తిరుమలరావు ఐశ్వరకు తెలియజేయడంతో ఆమె అందు కు ఓకే అన్నట్లు సమాచారం. హత్య తర్వాత తిరుమలరావు, ఐశ్వర్య లద్దాఖ్‌ వెళ్లేందుకు సర్వం సిద్ధం చేసుకున్న ట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. తేజేశ్వర్‌ హత్య తర్వాత సుపారీ గ్యాంగ్‌ సభ్యులు నాగేష్‌, పరశురాం, పరమేశ్వర్‌లకు తిరుమలరావు రూ.2 లక్షలు ఇచ్చాడని, హత్య విషయం బయటకు రావడంతో మిగతా రూ.18 లక్షలను అఽధికారులు సీజ్‌ చేసినట్లు సమాచారం.

అక్రమ సంబంధంపై చెల్లిని మందలించిన అన్న

ఐశ్వర్య, అమె తల్లి సుజాతకు తిరుమలరావుతో ఉన్న సాన్నిహిత్యాన్ని ఐశ్వర్య అన్న నవీన్‌ జీర్ణించుకోలేకపోయాడని, ఈ అక్రమ వ్యవహారంపై పలుమార్లు చెల్లిని మందలించినట్లు మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ క్రమంలో నవీన్‌ రెండు నెలల క్రితం ఇంట్లో జారిపడి మృతిచెందాడు. అప్పట్లో సాధారణంగా మృతిగానే అందరూ భావించారు. అయితే తేజేశ్వర్‌ హత్య ఉదంతం నేపథ్యంలో ఇప్పుడు నవీన్‌ మృతిపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Jun 25 , 2025 | 03:54 AM