ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Charge Sheet Filed: పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో చార్జిషీట్‌

ABN, Publish Date - Jun 24 , 2025 | 04:25 AM

చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో పోలీసులు సోమవారం తిరుపతి మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు.

  • తిరుపతి కోర్టులో దాఖలు చేసిన పోలీసులు

  • ఏ1 భానుకుమార్‌ రెడ్డి.. ఏ37 చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి

తిరుపతి(నేరవిభాగం), జూన్‌ 23(ఆంధ్రజ్యోతి): చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో పోలీసులు సోమవారం తిరుపతి మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. ఈ కేసులో మొదటి నిందితుడిగా రామచంద్రపురం జడ్పీటీసీ సభ్యురాలు డిల్లీరాణి భర్త, వైసీపీ నాయకుడు భానుకుమార్‌రెడ్డిని, ఏ37గా వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి పేరును నమోదు చేశారు. మరో ప్రధాన నిందితుడు, నడవలూరు సర్పంచి గణపతి రెడ్డిని కూడా ఈ కేసులో పోలీసులు అరెస్టు చేశారు.

గతేడాది మే 14న మధ్యాహ్నం 3.22 గంటల ప్రాంతంలో మహిళా విశ్వవిద్యాలయంలోని స్ట్రాంగ్‌ రూముల నుంచి వెనుదిరిగి వస్తున్న పులివర్తి నానీ వాహనాలపై వైసీపీ వర్గీయులు బీరు బాటిళ్లు, కర్రలు, ఇనుప రాడ్లు, సుత్తులతో దాడి చేశారు. వాహనాలను ధ్వంసం చేశారు. నానినీ గాయపరిచారు. నాని గన్‌మ్యాన్‌ ధరణి కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే దాదాపు 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. అన్ని కోణాల్లో విచారించి 37 మందిని నిందితులుగా గుర్తించారు. వీరిపై 307 సెక్షన్‌ కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు. వీరిలో నలుగురు ముందస్తు బెయిల్‌ తీసుకోవడంతో 33 మందిని అరెస్టు చేశారు. దాదాపు 13 నెలల పాటు విచారణ చేసి సోమవారం చార్జిషీటు దాఖలు చేశారు.

Updated Date - Jun 24 , 2025 | 04:25 AM