Polavaram Project: పోలవరానికి రూ.2,704 కోట్లు
ABN, Publish Date - Mar 13 , 2025 | 03:23 AM
పోలవరం ప్రాజెక్టు పనులకు కేంద్రం రూ.2,704 కోట్ల అడ్వాన్స్ నిధులు విడుదల చేసింది.
ప్రాజెక్టు కోసం ప్రత్యేక ఖాతాలో జమ
అమరావతి, మార్చి 12(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు పనులకు కేంద్రం రూ.2,704 కోట్ల అడ్వాన్స్ నిధులు విడుదల చేసింది. ఈ నిధులు బుధవారం రాష్ట్రానికి చేరాయి. కేంద్ర జలశక్తి ఆదేశాల మేరకు పోలవరం ప్రాజెక్టు కోసం ప్రత్యేకంగా తెరిచిన బ్యాంకు ఖాతాలో జమ చేశామని ప్రాజెక్టు చీఫ్ ఇంజనీరు నరసింహ మూర్తి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.
Updated Date - Mar 13 , 2025 | 03:23 AM