ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Tirumala: కారు నుంచి మంటలు

ABN, Publish Date - Jun 30 , 2025 | 04:17 AM

తిరుమల జీఎన్సీ టోల్‌గేట్‌ వద్ద ఆదివారం ఓ కారు అగ్నిప్రమాదానికి గురైంది. కర్ణాటక రాష్ట్రం కోలార్‌ జిల్లా గుడిపల్లికి చెందిన సుదర్శన్‌ శ్రీవారి దర్శనం కోసం తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో ఆదివారం తిరుమల బయలుదేరారు.

  • సురక్షితంగా బయటపడిన కర్ణాటక భక్తులు

తిరుమల, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): తిరుమల జీఎన్సీ టోల్‌గేట్‌ వద్ద ఆదివారం ఓ కారు అగ్నిప్రమాదానికి గురైంది. కర్ణాటక రాష్ట్రం కోలార్‌ జిల్లా గుడిపల్లికి చెందిన సుదర్శన్‌ శ్రీవారి దర్శనం కోసం తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో ఆదివారం తిరుమల బయలుదేరారు. మధ్యాహ్నం తిరుమలలోని జీఎన్సీ టోల్‌గేట్‌ వద్దకు చేరుకోగానే కారు ఇంజిన్‌ నుంచి పొగలు రావడాన్ని గుర్తించారు. వెంటనే అంతా వాహనం నుంచి కిందకు దిగి దూరంగా పరుగు తీశారు. నిమిషాల వ్యవధిలోనే కారు నుంచి మంటలు వ్యాపించాయి. టీటీడీ విజిలెన్స్‌, ఫైర్‌ సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే కారు సగభాగం కాలిపోయింది.

Updated Date - Jun 30 , 2025 | 04:19 AM