ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Bhimunipatnam: బాలికపై అత్యాచారం ఇద్దరి అరెస్టు

ABN, Publish Date - Jun 09 , 2025 | 04:56 AM

విశాఖ జిల్లా భీమునిపట్నంలో ఓ బాలికపై యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. విజయనగరం పట్టణానికి చెందిన బాలిక భీమిలిలో అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ పదో తరగతి వరకు చదువుకుంది. ఈ క్రమంలో బాలికకు....

భీమునిపట్నం (విశాఖపట్నం), జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): విశాఖ జిల్లా భీమునిపట్నంలో ఓ బాలికపై యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. విజయనగరం పట్టణానికి చెందిన బాలిక భీమిలిలో అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ పదో తరగతి వరకు చదువుకుంది. ఈ క్రమంలో బాలికకు.. హేమలత అనే మహిళతో పరిచయమైంది. ఆమె చేపల తిమ్మాపురంలో రాడ్‌ బెండింగ్‌ పనులు చేస్తున్న నూకరాజుకు పరిచయం చేసింది. అతను ఉపాధి చూపిస్తానని నమ్మబలికి ఇంటికి తీసుకువెళ్లి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఏడాది ఏప్రిల్‌ నెలాఖరున జరిగిన ఈ ఘటనపై ఆమె తల్లిదండ్రులు శనివారం భీమిలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికను వైద్య పరీక్షలకు కేజీహెచ్‌కు తరలించారు. నూకరాజు, అతడికి సహకరించిన హైమావతిపై పోక్సో నమోదు చేశారు. అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Updated Date - Jun 09 , 2025 | 04:58 AM