BCY Party Leader: బడుగులకు రాజ్యాధికారం బాధ్యత బీసీవైదే
ABN, Publish Date - Jul 24 , 2025 | 04:02 AM
రాష్ట్రంలో రెండు సామాజిక వర్గాలు మినహా మిగిలిన వర్గాలను ఏకం చేసి, బడుగులను రాజ్యాధికారం వైపు నడిపించే బాధ్యత బీసీవై పార్టీదేనని ఆ పార్టీ అధినేత బోడె
బీసీవై పార్టీ నేత బోడె రామచంద్ర యాదవ్
విజయవాడ/మంగళగిరి సిటీ, జూలై 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రెండు సామాజిక వర్గాలు మినహా మిగిలిన వర్గాలను ఏకం చేసి, బడుగులను రాజ్యాధికారం వైపు నడిపించే బాధ్యత బీసీవై పార్టీదేనని ఆ పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ అన్నారు. భారత చైతన్య యువజన పార్టీ(బీసీవై) రెండవ ఆవిర్భావ వేడుకలను బుధవారం విజయవాడలో నిర్వహించారు. ఈ సందర్భంగా రామచంద్ర మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో ఆ రెండు సామాజిక వర్గాలే అధికారాన్ని అనుభవిస్తున్నాయని, వాటిని రాజకీయంగా బహిష్కరించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ‘బీసీవై భరోసా యాత్ర’ పేరుతో బహుజన చైతన్యం, యువజన పోరాటానికి నాంది పలకబోతున్నామని చెప్పారు. జగన్ వికృత రాజకీయాలతో రాష్ట్రం నాశనమైందని అన్నారు. కాగా, ప్రాణం ఉన్నంత వరకు కరేడు రైతుల కోసం పోరాటం చేస్తానని రామచంద్ర చెప్పారు.
దోసకాయను ఉప్పుతో తింటున్నారా? ఈ ముఖ్య విషయం తెలుసుకోండి.!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి.. లేదంటే..!
Updated Date - Jul 24 , 2025 | 04:02 AM