Nandamuri Balakrishna : రాష్ట్రాన్ని వైసీపీ సర్వనాశనం చేసింది
ABN, Publish Date - Jan 22 , 2025 | 05:00 AM
గత ఐదేళ్ల పాలనలో వైసీపీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విమర్శించారు.
ఎన్టీఆర్, చంద్రబాబు అభినవ భగీరథులు: బాలకృష్ణ
హిందూపురం, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): గత ఐదేళ్ల పాలనలో వైసీపీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విమర్శించారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో మంగళవారం ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. లేపాక్షి, చిలమత్తూరు మండలాల్లో రైతులకు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు పంపిణీ చేశారు. రవాణా, పోలీసు శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్డు భద్రతా వారోత్సవాల్లో పాల్గొన్నారు. బైక్ ర్యాలీలో హెల్మెట్ ధరించి బుల్లెట్ నడిపారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. రాయలసీమకు నీరు అందించే హంద్రీనీవా ఎత్తిపోతల పథకం ఎన్టీఆర్ మానస పుత్రిక అని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా హంద్రీనీవా పనులను దృఢ సంకల్పంతో ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు అభినవ భగీరథులని కొనియాడారు. కాగా, తాను తీసే ప్రతి సినిమా సమాజానికి సందేశమిచ్చేలా ఉంటుందని, అందుకే సూపర్‌హిట్ అవుతున్నాయని చెప్పారు. నీటికోసం పోరాడే రైతులను దృష్టిలో పెట్టుకుని ‘డాకు మహారాజ్’ సినిమాలో నటించానని అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Palla Srinivas: టీడీపీ కోటి సభ్యత్వం.. ఆ ముగ్గురిదే ఘనత
Chandrababu: వీర జవాన్ కార్తీక్ మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం..
CM Chandrababu: దిగ్గజ కంపెనీల అధిపతులతో సమావేశాలు.. చంద్రబాబు షెడ్యూల్ ఇదే
Read Latest AP News And Telugu News
Updated Date - Jan 22 , 2025 | 05:01 AM