AP Animal Department: బక్రీద్‌కు ఆవులు, ఒంటెలను వధిస్తే చర్యలు
ABN, Publish Date - Jun 06 , 2025 | 05:54 AM
బక్రీద్ పండుగ సందర్భంగా ఆవులు, దూడలు, ఒంటెలను వధిస్తే.. జంతు సంరక్షణ చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ దామోదర్‌నాయుడు హెచ్చరించారు.
రాష్ట్ర పశుసంవర్ధకశాఖ హెచ్చరిక
అమరావతి, జూన్ 5(ఆంధ్రజ్యోతి): బక్రీద్ పండుగ సందర్భంగా ఆవులు, దూడలు, ఒంటెలను వధిస్తే.. జంతు సంరక్షణ చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ దామోదర్‌నాయుడు హెచ్చరించారు. జంతు సంరక్షణ, గోవధ నిషేధ చట్టాల ప్రకారం రాష్ట్రంలో ఈ జంతువుల వధపై నిషేధం ఉందని గురువారం ఓ ప్రకటనలో ఆయన తెలిపారు. ఈ చట్టాలను గౌరవించి, వీటిని వధించరాదని కోరారు. క్షేత్రస్థాయిలో పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని, జంతు వధను నివారించాలని పశుసందర్ధక శాఖ సిబ్బందిని ఆయన ఆదేశించారు.
Updated Date - Jun 06 , 2025 | 05:57 AM