ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

APPSC : గ్రూప్ - 1 మెయిన్స్ ఫలితాలు విడుదల

ABN, Publish Date - Jun 10 , 2025 | 09:05 PM

గ్రూప్- 1 మెయిన్స్ ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది.

అమరావతి, జూన్ 10: గ్రూప్- 1 మెయిన్స్ ఫలితాలను ఏపీపీఎస్సీ మంగళవారం విడుదల చేసింది. ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో ఫలితాలను అభ్యర్థులకు అందుబాటులో ఉంచింది. 1 : 2 నిష్పత్తిలో అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఏపీపీఎస్సీ ఎంపిక చేసింది. ఈ పరీక్షలు మే 3 నుంచి 9వ తేదీ వరకు గ్రూప్- 1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు.

ఈ పరీక్షలు జరిగిన నెలరోజుల్లోనే ఈ ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఇక ఈ పరీక్షలకు దాదాపు 4 వేల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. మరోవైపు జూన్ 23 నుంచి 30వ తేదీ వరకు ఈ గ్రూప్ -1 ఇంటర్వ్యూలు నిర్వహించ నున్నారు. మొత్తం 81 గ్రూప్ -1 పోస్టులకు 2024, మార్చి 17వ తేదీన ప్రిలిమ్స్ పరీక్ష‌ను ఏపీపీఎస్సీ నిర్వహించిన సంగతి తెలిసిందే.

ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడు నిర్వహించారంటే..

2024, మార్చి 17వ తేదీ ఈ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను ఏపీపీఎస్సీ నిర్వహించింది. ఈ పరీక్షకు 1, 48, 881 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కానీ వారిలో 1, 26, 068 మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. అందులో 91,463 (72.55 శాతం) మంది ఈ పరీక్షకు హాజరయ్యారు. ఇక వీరిలో మెయిన్స్ పరీక్షకు 4, 496 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వీరిలో 182 మంది ఇంటర్వ్యూకు చేరుకున్నారు.

పరీక్ష ఫలితాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి..

https://psc.ap.gov.in/Documents/RESULTS/122023_Mains/Group_IMainResultNotificationforOraltestInterviewtoNotfNo122023.pdf

ఇవి కూడా చదవండి

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్

అనంతపురం జిల్లా ఘటనపై చంద్రబాబు సీరియస్..

Read latest AP News And Telugu News

Updated Date - Jun 10 , 2025 | 10:09 PM