AP Metro Project: ఏపీలో మెట్రో రైల్ ప్రాజెక్ట్‌లో కీలక ముందడుగు
ABN, Publish Date - May 14 , 2025 | 01:31 PM
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే మెట్రో పరుగులు తీయనుంది. తక్కువ వడ్డీకి రుణం ఇచ్చే పలు విదేశీ బ్యాంకుల ప్రతినిధులతో మెట్రో రైలు కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి సమావేశమై సంప్రదింపులు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణాలు ఊపందుకుంటున్న సంగతి తెలిసిందే. ఆ నగరం పూర్తి అయితే కచ్చితంగా దాని ప్రభావం ఏపీలోని రెండు కీలక నగరాలైన విజయవాడ, విశాఖలోపై పడనుంది. ట్రాఫిక్ రద్దీ మరింత పెరిగిపోనుంది. అందుకే ముందు జాగ్రత్తగా ఆ రెండు జిల్లాలో మెట్రో ప్రతిపాదన తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం. ఇప్పటికే దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా ఓకే చెప్పింది. ఇందులో భాగంగానే మెట్రో నడిచే ప్రాంతాల్లో భూసేకరణకు చర్యలు తీసుకుంది. అంతేకాకుండా, ఈ రెండు ప్రాజెక్టుల డీపీఆర్ లు సిద్ధం చేయడంతో పాటు టెండర్ల ప్రక్రియ కూడా రెడీ అయింది.
ఈ నేపధ్యంలోనే మెట్రో రైల్ ప్రాజెక్ట్‌లో కీలక ముందడుగుపడింది. AIIB బ్యాంకు ప్రతినిధులతో ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్టారెడ్డి సమావేశం అయ్యారు. తక్కువ వడ్డీకి రుణం ఇచ్చే బ్యాంకులతో సంప్రదింపులు జరిపారు. రుణాలు ఇచ్చేందుకు పలు విదేశీ బ్యాంకులు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. KFW, AFD, ADB, NDB, AIIB, జైకా, ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు విశాఖ మెట్రోకు రూ.6,100 కోట్లు రుణం సమీకరించాలని, అలాగే విజయవాడ మెట్రోకు రూ.5,900 కోట్లు రుణం సమీకరించాలని నిర్ణయించారు.
Also Read:
Minister Lokesh: రీన్యూ ఎనర్జీ కాంప్లెక్స్.. 16న లోకేష్ శంకుస్థాపన
Fraud Case: శ్రవణ్ రావును విచారిస్తున్న సీసీఎస్ పోలీసులు
Operation Sindoor: చైనాకు భారత్ షాక్.. ఇది మామూలు దెబ్బ కాదు
Updated Date - May 14 , 2025 | 02:07 PM