ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఏపీ మద్యం స్కాంను పార్లమెంట్‌లో లేవనెత్తుతాం:ఎంపీ లావు

ABN, Publish Date - Jul 21 , 2025 | 03:05 AM

మద్యం కుంభకోణం గురించి పార్లమెంట్‌ లో లేవనెత్తుతామని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు.

  • టీడీపీపీ నేత శ్రీకృష్ణదేవరాయలు వెల్లడి

న్యూఢిల్లీ, జూలై 20 (ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం గురించి పార్లమెంట్‌ లో లేవనెత్తుతామని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. ఆదివారం ఢిల్లీలో పార్లమెంట్‌ సమావేశాలపై జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఏపీలో రూ.3,500 కోట్ల మద్యం స్కాం జరిగిందని, దానిపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిన, దేశమంతా తెలియాల్సిన అవసరముందని చెప్పారు. గతంలో వందకోట్ల రూపాయల పశుగ్రాసం కుంభకోణంపైనా పార్లమెంట్‌ చర్చ జరిగిందని గుర్తు చేశారు. ప్రధాని ధనధాన్య పథకంపై చర్చ జరగాలని అన్నారు. పొగాకు, మామిడి రైతుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం పంటను కొనుగోలు చేసి ఆదుకుందని, ఈ నేపథ్యంలో రైతులను మరింత ఆదుకోవాలని కోరారు. జల జీవన్‌ మిషన్‌పై కూడా పార్లమెంట్‌లో చర్చ జరగాలని కోరామన్నారు. గతంలో కేంద్రం రూ.4 వేల కోట్లు ఈ పథకం కింద రాష్ట్రానికి కేటాయిస్తే రూ.2 వేల కోట్లే గత ప్రభుత్వం వినియోగించుకుందని, చాలావరకు నిధుల మళ్లింపు జరిగిందని చెప్పారు. గోదావరి, పెన్నా నదులను అనుసంధానించే ప్రయత్నాలను ఏపీ చేస్తోందన్నారు. కేంద్రం నిధులిస్తే కార్యరూపం దాల్చే అవకాశం ఉందన్నారు. సామాజిక మాధ్యమాల్లో మహిళలకు వ్యతిరేకంగా వచ్చే పోస్టులను ప్రతిఒక్కరూ ఖండించాలని కోరారు.

ఈ వార్తలు కూడా చదవండి..

రండి.. ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించుకుందాం: మంత్రి లోకేష్ పిలుపు

ఈ సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చిస్తాం: కిరణ్ రిజిజు

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం

For More AndhraPradesh News And Telugu News

Updated Date - Jul 21 , 2025 | 03:10 AM